Breaking News

సెమీఫైనల్లో ఆస్ట్రేలియా

Published on Fri, 10/17/2025 - 04:26

సాక్షి, విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ ఇదే మైదానంలో మరో శతకంతో అదరగొట్టింది. ఆసీస్‌ బౌలర్ల ప్రదర్శనతో తోడు హీలీ, ఫోబీ లిచ్‌ఫీల్డ్‌ మెరుపు భాగస్వామ్యం డిఫెండింగ్‌ చాంపియన్‌కు ఘన విజయంతోపాటు సెమీఫైనల్‌ బెర్త్‌ను కూడా అందించింది. వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా గురువారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శోభన మొస్తరి (80 బంతుల్లో 66 నాటౌట్‌; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, రుబియా హైదర్‌ (59 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించింది. ఆసీస్‌ ఆటగాళ్లు నాలుగు క్యాచ్‌లు వదిలిపెట్టడంతో బంగ్లా ఈమాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలానా కింగ్‌ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేయగా... వేర్‌హామ్, అనాబెల్‌ సదర్లాండ్, యాష్లే గార్డ్‌నర్‌ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. 

అనంతరం ఆ్రస్టేలియా 24.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 202 పరుగులు సాధించి గెలిచింది. అలీసా హీలీ (77 బంతుల్లో 113 నాటౌట్‌; 20 ఫోర్లు) కెరీర్‌లో ఏడో సెంచరీ సాధించగా... లిచ్‌ఫీల్డ్‌ (72 బంతుల్లో 84 నాటౌట్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచింది. బంగ్లాదేశ్‌ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయింది. తాజా విజయంతో 5 మ్యాచ్‌ల తర్వాత 9 పాయింట్లతో ఆసీస్‌ తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకొని సెమీఫైనల్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో పరాజయం. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది.

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)