Breaking News

చరిత్ర సృష్టించిన రసెల్‌, రూథర్‌ఫోర్డ్‌ జోడీ

Published on Tue, 02/13/2024 - 21:12

పొట్టి క్రికెట్‌లో ఆండ్రీ రసెల్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ జోడీ (వెస్టిండీస్‌ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో రసెల్‌, రూథర్‌ఫర్డ్‌ జోడీ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి గత రికార్డును బద్దలుకొట్టింది.

ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు పపువా న్యూ గినియా జోడీ (టోనీ ఉరా-నార్మన్‌ వనువా) పేరిట ఉండింది. 2022లో జరిగిన ఓ మ్యాచ్‌లో పపువా జోడీ ఆరో వికెట్‌కు అత్యధికంగా 115 పరుగులు జోడించింది. దీనికి ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్‌ జోడీ (మైక్‌ హస్సీ-కెమరూన్‌ వైట్‌) పేరిట ఉండింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హస్సీ-వైట్‌ కాంబో ఆరో వికెట్‌కు అజేయమైన 101 పరుగులు జోడించింది. 

ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక విండీస్‌ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రసెల్‌ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్‌ (40 బంతుల్లో 67 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి విండీస్‌ను గెలిపించారు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రసెల్‌, రూథర్‌ఫోర్డ్‌తో పాటు రోస్టన్‌ ఛేజ్‌ (37), రోవ్‌మన్‌ పావెల్‌ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. 

భారీ లక్ష్య ఛేదన​కు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్‌ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలుత విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్‌ అయిన వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ (19 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

నిర్ణీత ఓవర్లలో ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్‌ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్‌ (12) సహా, హిట్టర్లు మిచ్‌ మార్ష్‌ (17), ఆరోన్‌ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్‌ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్‌ విజయం సాధించింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)