Breaking News

సీన్‌ అబాట్‌ ఆల్‌రౌండ్‌ షో.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్‌

Published on Sun, 02/04/2024 - 18:22

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్‌ ఆటగాడు సీన్‌ అబాట్‌ ఆల్‌రౌండ్‌ షోతో (69 పరుగులు, 3 వికెట్లు) విండీస్‌ను ఓడించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన అబాట్‌ 63 బంతుల్లో 4 సిక్సర్లు, బౌండరీ సాయంతో 69 పరుగులు చేసి ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో గ్రీన్‌ (33), షార్ట్‌ (41), లబూషేన్‌ (26), ఆరోన్‌ హార్డీ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలరల్లో గుడకేశ్‌ మోటీ 3 వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాశించగా.. అల్జరీ జోసఫ్‌, రొమారియో షెపర్డ్‌ తలో​ 2 వికెట్లు, మాథ్యూ ఫోర్డ్‌, ఒషేన్‌ థామస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. సీన్‌ అబాట్‌ (3/40), జోష్‌ హాజిల్‌వుడ్‌ (3/43) విజృంభించడంతో 43.3 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. సదర్‌ల్యాండ్‌ 2, ఆరోన్‌ హార్డీ, ఆడమ్‌ జంపా తలో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో కీసీ కార్టీ (40) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. అలిక్‌ అథనాజ్‌ (11), షాయ్‌ హోప్‌ (29), రోస్టన్‌ చేజ్‌ (25), అల్జరీ జోసఫ్‌ (19) రెండంకెల స్కోర్‌ చేశారు.

ఈ సిరీస్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఫిబ్రవరి 6న జరుగనుంది. వన్డే సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)