Breaking News

నిప్పులు చెరిగిన కమిన్స్‌, హాజిల్‌వుడ్‌.. ఓపెనర్‌గా విఫలమైన స్టీవ్‌ స్మిత్‌

Published on Wed, 01/17/2024 - 13:00

AUS VS WI 1st Test: రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్‌ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్‌ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది.

ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన స్టీవ్‌ స్మిత్‌ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్‌ (10) కూడా తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు. ఉస్మాన్‌ ఖ్వాజా (30), కెమరూన్‌ గ్రీన్‌ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ అరంగేట్రం పేసర్‌ షమార్‌ జోసఫ్‌ 2 వికెట్లు పడగొట్టాడు. 

అంతకుముందు ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన  వెస్టిండీస్‌.. ఆసీస్‌ పేసర్లు జోష్‌ హాజిల్‌వుడ్‌ (4/44), కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌​ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయోన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ కిర్క్‌ మెక్‌కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు.

ఓపెనర్లు బ్రాత్‌వైట్‌ (13), తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (6), అలిక్‌ అథనాజ్‌ (13), కవెమ్‌ హాడ్జ్‌ (12), జస్టిన్‌ గ్రీవ్స్‌ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్‌ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్‌ ఆటగాడు షమార్‌ జోసఫ్‌ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌ ఆడి విండీస్‌ పరువు కాపాడాడు. షమార్‌.. కీమర్‌ రోచ్‌తో (17 నాటౌట్‌) కలిసి చివరి వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)