Breaking News

సిక్సర్‌తో ఆగమనం.. వన్డేల్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన డెవాల్డ్‌ బ్రెవిస్‌

Published on Tue, 08/19/2025 - 18:42

సౌతాఫ్రికా చిచ్చరపిడుగు డెవాల్డ్‌ బ్రెవిస్‌ వన్డే క్రికెట్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫార్మాట్‌లో తానెదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో ఈ ఘనతను అతి కొద్ది మంది (2002 తర్వాత) మాత్రమే సాధించారు. 

బ్రెవిస్‌కు ముందు షమీమ్‌ హొస్సేన్‌ (బంగ్లాదేశ్‌), ఇషాన్‌ కిషన్‌ (భారత్‌), రిచర్డ్‌ నగరవ (జింబాబ్వే), క్రెయిగ్‌ వ్యాలెస్‌ (స్కాట్లాండ్‌), జవాద్‌ దావూద్‌ (కెనడా), జోహన్‌ లవ్‌ (సౌతాఫ్రికా) వన్డేల్లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచారు. జోహన్‌ లవ్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో సౌతాఫ్రికా ఆటగాడిగా బ్రెవిస్‌ రికార్డు నెలకొల్పాడు.

బాధాకరమేమిటంటే బ్రెవిస్‌ సిక్సర్‌ బాదిన మరుసటి బంతికే ఔటయ్యాడు. కెయిన్స్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన బ్రెవిస్‌ వేగంగా పరుగులు సాధించే క్రమంలో తొలి బంతికి సిక్సర్‌ కొట్టి, ఆతర్వాతి బంతికే ట్రవిస్‌ హెడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్‌ (82), బవుమా (65),  మాథ్యూ బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో ట్రవిస్‌ హెడ్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్‌ కూడా చేశాడు.

అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. కేశవ్‌ మహారాజ్‌ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్‌ 22న జరుగనుంది.

సెంచరీ.. ఓ హాఫ్‌ సెంచరీ
వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బ్రెవిస్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, ఓ హాఫ్‌ సెంచరీ సాధించాడు. దురదృష్టవశాత్తు ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా గెలవలేకపోయింది. 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బ్రెవిస్‌ 180 పరుగులతో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

 

 

 

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి