Breaking News

బాబర్‌ను హత్తుకున్న ఖవాజా చిన్నారి కూతురు.. అందమైన దృశ్యాలు

Published on Tue, 12/26/2023 - 12:11

ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ మధ్య రెండో టెస్టు ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. క్రిస్‌మస్‌ సందర్భంగా ఆసీస్‌ క్రికెటర్లకు స్వీట్‌ షాకిచ్చారు పాక్‌ ప్లేయర్లు. బాక్సింగ్‌ డే టెస్టుకు ముందు ఇండోర్‌ సెషన్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న కంగారూ ఆటగాళ్లను బహుమతులతో ముంచెత్తారు.

క్రిస్‌మస్‌ సందర్భంగా వారి కుటుంబాలకు కానుకలు అందజేసిన పాకిస్తానీ క్రికెటర్లు.. చిన్నపిల్లలకు లాలీపాప్స్‌ అందించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్ల చర్యకు ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ సహా డేవిడ్‌ వార్నర్‌, ట్రవిస్‌ హెడ్ తదితరలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ వారి ప్రయత్నాన్ని అభినందించారు.

ఇక ఆసీస్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా కూతుళ్లు.. పాక్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను ఆత్మీయంగా హత్తుకుని ధన్యవాదాలు తెలియజేయడం హైలైట్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన అందమైన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. ‘‘మైదానంలో దిగిన తర్వాతే ప్రత్యర్థులం.. మైదానం వెలుపల మాత్రం మేమెప్పటికీ స్నేహితులమే అన్న భావనతో మెలుగుతామని ఈ క్రీడాకారులు మరోసారి నిరూపించారు’’ అంటూ క్రికెట్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా మెల్‌బోర్న్‌ వేదికగా మంగళవారం ఆసీస్‌- పాక్‌ మధ్య రెండో టెస్టు ఆరంభమైంది. టాస్‌ గెలిచిన పర్యాటక పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో కాసేపు ఆటను నిలిపివేశారు. అప్పటికి 42.4 ఓవర్లలో ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఇక వాన తెరిపినివ్వడంతో మళ్లీ ఆటను ఆరంభించగా.. 50 ఓవర్లలో స్కోరు 126-2గా ఉంది.

చదవండి: స్టార్‌ బౌలర్లకు షాకిచ్చిన అఫ్గన్‌ బోర్డు.. రెండేళ్ల నిషేధం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)