Breaking News

నమ్మశక్యం కాని రీతిలో బాబర్‌ బౌల్డ్‌.. పాక్‌ మాజీ బ్యాటర్‌ ట్వీట్‌

Published on Wed, 12/27/2023 - 20:12

ఆస్ట్రేలియా పర్యటనలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజంనకు మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ యూసఫ్‌ అండగా నిలిచాడు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనపుడు ఓపికగా వేచి చూడాలని సూచించాడు. కఠిన సవాళ్లు ఎదురైపుడు మరింత ధైర్యంగా ముందుకు సాగాలే తప్ప డీలా పడకూడదంటూ బాబర్‌కు మద్దతుగా నిలిచాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాక్‌ విఫలమైన నేపథ్యంలో బాబర్‌ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షాన్‌ మసూద్‌ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. అతడి సారథ్యంలో తొలిసారిగా.. పాకిస్తాన్‌ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. 

ఇందులో భాగంగా తొలి టెస్టులో 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన పాక్‌ జట్టు.. రెండో టెస్టులోనైనా పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అంతకుముందు ఆస్ట్రేలియా 318 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఈ రెండు మ్యాచ్‌లలోనూ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దారుణంగా విఫలమయ్యాడు. మొదటి టెస్టులో 35 పరుగులు సాధించిన బాబర్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేశాడు. బుధవారం నాటి ఆటలో ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో నమ్మశక్యం కాని రీతిలో బౌల్డ్‌ అయ్యాడు.

ఈ నేపథ్యంలో బాబర్ ఆజం ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. నెట్టింట అతడిపై ట్రోల్స్‌ పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ బ్యాటర్‌ మహ్మద్‌ యూసఫ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించాడు. ‘‘ధైర్యంగా ఉండు. పరిస్థితులు తప్పక మెరుగుపడతాయి’’ అంటూ బాబర్ ఆజంకు అండగా నిలిచాడు. ఇపుడు తుఫాను ఉన్నంత మాత్రాన.. ఎల్లకాలం వాన కురుస్తూనే ఉండదు కదా అంటూ త్వరలోనే.. తిరిగి మునుపటి ఫామ్‌ అందుకోవాలని ఆకాంక్షించాడు. 
 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)