బుమ్రా స్థానంలో సంచలన ఫాస్ట్‌ బౌలర్‌..?

Published on Sun, 08/02/2026 - 17:51

ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా దూరం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 29 ఏళ్ల సంచలన ఫాస్ట్‌ బౌలర్‌, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌గా పేరున్న ఆకిబ్‌ నబీ దార్‌ పేరు తెరపైకి వచ్చింది.

బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ పేరు దాదాపుగా ఖరారైనట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. నబీకి దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 2025-26 రంజీ ట్రోఫీలో అతడు 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసుకుని టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. జమ్మూ కశ్మీర్‌ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ సాధించడంలోనూ నబీ కీలక పాత్ర పోషించాడు.

ఓవరాల్‌గా అతడి ఫస్ట్‌క్లాస్‌ రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది.
* మ్యాచ్‌లు: 43
* వికెట్లు: 162
* బౌలింగ్‌ సగటు: 18.63
* 5 వికెట్ల ప్రదర్శనలు: 16
* 10 వికెట్ల ప్రదర్శనలు: 4
* అత్యుత్తమ బౌలింగ్‌: 7/24

శ్రీలంకలోనూ సత్తా నబీ
ఇటీవల భారత్‌-A జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లిన నబీ, శ్రీలంక-Aతో జరిగిన రెండు ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4/58తో ఆకట్టుకున్నాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నబీకి ఇప్పటివరకు భారత సీనియర్‌ జట్టులో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో అతడి నిలకడైన ప్రదర్శన, శ్రీలంక పరిస్థితులపై ఇటీవల వచ్చిన అనుభవం అతడికి కలిసొచ్చే అవకాశముంది.

ఇదిలా ఉంటే, ఎడమ మోకాలి అసౌకర్యం నుంచి బుమ్రా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తొందరపెట్టకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. బుమ్రా ప్రత్యామ్నాయాన్ని సెలెక్టర్లు అతి త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

 

 

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)