చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌ ఆడిన ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం

Published on Fri, 01/09/2026 - 10:55

భారత ఫాస్ట్‌ బౌలింగ్‌ సంచలనం, జమ్మూ అండ్‌ కశ్మీర్‌ ఆల్‌రౌండర్‌ ఆకిబ్‌ నబీ దార్‌ విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. నిన్న (జనవరి 8) హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన దార్‌.. సూపర్‌ సెంచరీతో కదంతొక్కాడు. 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ అండ్‌ కశ్మీర్‌ 90 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

ఈ దశ బరిలోకి దిగిన దార్‌ సుడిగాలి శతకం బాది తన జట్టును గెలిపించాడు. 82 బంతుల్లో  10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి మరో ఎండ్‌ నుంచి విన్ష్‌రాజ్‌ శర్మ (69 నాటౌట్‌) అద్భుతంగా సహకరించాడు. 

వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 182 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్‌లో దార్‌ బౌలింగ్‌లోనూ రాణించాడు. 10 ఓవర్లలో 56 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌.. అమన్‌ రావ్‌ (60), రాహుల్‌ సింగ్‌ (56), నితేశ్‌ రెడ్డి (54 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. జమ్మూ కశ్మీర్‌ బౌలర్లలో దార్‌ 3, ఆబిద్‌ ముస్తాక్‌ 2, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, వన్ష్‌రాజ్‌ శర్మ, సాహిల్‌ లోత్రా తలో వికెట్‌ తీశారు. అనంతరం 269 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ కశ్మీర్‌ ఓటమి దిశగా సాగినప్పటికీ.. దార్‌ సూపర్‌ సెంచరీ కారణంగా అనూహ్యంగా పుంజుకొని చిరస్మరణీయ విజయం సాధించింది.

 

 

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)