Breaking News

విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్‌..!

Published on Thu, 10/09/2025 - 11:59

రేపటి నుంచి (అక్టోబర్‌ 10) వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌లో భారత తుది జట్టు ఇదే అంటూ అసిస్టెంట్‌ కోచ్‌ టెన్‌ డస్కటే హింట్‌ ఇచ్చాడు.  ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఎలాంటి మార్పులు ఉండవని సంకేతాలిచ్చాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదని ప్రీ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తెలిపాడు.

సుదూర అవసరాల దృష్ట్యా నితీశ్‌ కుమార్‌ రెడ్డికి మరిన్ని అవకాశాలుంటాయని చెప్పకనే చెప్పాడు. నితీశ్‌ను నాణ్యమైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపాడు. 

తొలి టెస్ట్‌లో విఫలమైనా సాయి సుదర్శన్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నాడు. పరుగులు సాధించలేకపోతే జట్టులో ఎవరి స్థానం సుస్థిరం కాదని గుర్తు చేశాడు. ఈ సందర్భంగా కరుణ్‌ నాయర్‌ పేరును ప్రస్తావించాడు.

తొలి టెస్ట్‌లో జురెల్‌ సెంచరీ సాధించడం వల్ల సాయిపై ఒత్తిడి ఉంటుందంటూ పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చాడు. ఇదే సందర్భంగా జురెల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పంత్‌ గైర్హాజరీలో ఆ స్థానానికి న్యాయం చేశాడని అన్నాడు. జురెల్‌ మిడిలార్డర్‌లో సరిగ్గా ఫిట్‌ అవుతాడని ముందే ఊహించామని తెలిపాడు.

డస్కటే ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. రెండో టెస్ట్‌లో కూడా పడిక్కల్‌, అక్షర్‌ పటేల్‌, జగదీసన్‌, ప్రసిద్ద్‌ కృష్ణ బెంచ్‌కు పరిమితం కావల్సిందే.

కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగి సత్ఫలితం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించి విండీస్‌ను మట్టికరిపించారు. 

రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి సిరాజ్‌ 7 వికెట్లు తీయగా.. బుమ్రా 3, కుల్దీప్‌, జడేజా తలో 4, సుందర్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఒకే ఇన్నింగ్స్‌లో భారత్‌ బ్యాటింగ్‌ చేయగా.. కేఎల్‌ రాహుల్‌, జురెల్‌, రవీంద్ర జడేజా శతకాలు బాదారు.

విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. తొలి బౌలర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)