Breaking News

జూడోలో భారత్‌కు స్వర్ణం.. ఒక్క‌రోజే 13 ప‌త‌కాలు ఖ‌రారు!

Published on Fri, 07/31/2026 - 21:06

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. జూడోలో మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో కెనడాకు చెందిన హెల్దీ క్వాచ్‌పై 4-0తో విజయం సాధించిన అస్మితా దే స్వర్ణం సాధించింది. జూడోలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఇక జూడోలో స్వర్ణం సాధించిన తొలి మహిళా ప్లేయర్‌గా అస్మితా రికార్డులకెక్కింది. ఈ గేమ్స్‌లో ఇది భారత్‌కు 4వ స్వర్ణం కాగా, ఓవరాల్‌గా భారత్‌కు ఇది 18వ పతకం. 

ఇక కామన్‌వెల్త్‌లో భారత అథ్లెట్ల జోరు కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ 18 ప‌త‌కాలు (4 స్వ‌ర్ణాలు, 10 ర‌జ‌తాలు, 4 కాంస్యాలు) సాధించింది. అయితే గేమ్స్‌లో భాగంగా 9వ రోజైన శుక్ర‌వారం ఒక్క‌రోజే భార‌త్ ఖాతాలో 13 ప‌త‌కాలు ఖ‌రార‌య్యాయి. ఇందులో బాక్సింగ్ నుంచి 10 ప‌త‌కాలు ఉంటే, జూడో నుంచి మ‌రో మూడు ప‌త‌కాలు ఉన్నాయి. 

జూడో గేమ్‌లో హ‌ర్ష్ సింగ్‌, యామిని మౌర్య‌, అస్మితా దే ఫైన‌ల్‌కు దూసుకెళ్లారు. ఫైన‌ల్లో గెలిస్తే స్వ‌ర్ణం లేదంటే ర‌జ‌తాలు ద‌క్క‌నున్నాయి. ఇక బాక్సింగ్‌లో భార‌త్ పంచ్ ప‌వ‌ర్ అదుర్స్ అనిపిస్తోంది. భార‌త బాక్స‌ర్ల‌లో ప్రీతి ప‌వార్‌, అంకుశ్ పంగ‌ల్‌, జాస్మిన్ లంబోరియా, జాదుమ‌ణి సింగ్‌, అరుంధ‌తీ చౌద‌రీలు శ‌నివారం ఫైన‌ల్ మ్యాచ్‌లు ఆడ‌నున్నారు. గెలిస్తే ఐదు స్వ‌ర్ణాలు.. ఓడితే ఐదు ర‌జ‌తాలు భార‌త్ ఖాతాలో చేరనున్నాయి. 

ఇక మరో ఐదుగురు భార‌త బాక్స‌ర్లు సెమీస్‌కు అర్హ‌త సాధించ‌డంతో క‌నీసం కాంస్యం ఖ‌రారు చేసుకున్నారు. ఇక ఇవాళ అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత జావెలిన్ త్రో ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. అంద‌రి క‌ళ్లు నీర‌జ్ చోప్రాపైనే ఉన్నాయి. నీర‌జ్ క‌చ్చితంగా స్వర్ణం లేదా క‌నీసం ర‌జ‌త‌మైనా ఒడిసిప‌డ‌తడ‌ని అంతా భావిస్తున్నారు. నీరజ్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు భార‌త జావెలిన్ త్రోయ‌ర్లు కూడా బ‌రిలో ఉండ‌డంతో ప‌త‌కాల‌పై ఆశ‌లు మ‌రింత పెరుగుతున్నాయి. 

ఇలా శుక్ర‌వారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 13 ప‌త‌కాలకు పైగా ఖ‌రారు కావ‌డంతో భార‌త్‌కు ఆదివారం లోగా 30 నుంచి 31 ప‌త‌కాలు వ‌చ్చే అవ‌కాశాలైతే మెండుగా ఉన్నాయి. ఇవాళ‌ జూడో మ‌హిళ‌ల విభాగంలో అస్మితా దే (48 కేజీల విభాగంలో), యామిన్ మౌర్య (57 కేజీల విభాగంలో) ఫైన‌ల్ ఆడ‌నుండ‌గా, పురుషుల విభాగంలో హ‌ర్ష్ సింగ్ (60 కేజీలు) ఫైనల్లో ఆడ‌నుండ‌డంతో భార‌త్ ప‌త‌కాల సంఖ్య 20కి చేర‌నుంది.

 

 

 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)