Breaking News

34 బంతుల్లోనే సెంచరీ.. రోహిత్‌ శర్మ, డేవిడ్‌ మిల్లర్‌ రికార్డు బద్దలు

Published on Wed, 09/27/2023 - 08:46

Asian Games Mens T20I 2023 - Nepal vs Mongolia: ఆసియా క్రీడలు-2023లో నేపాల్‌ క్రికెటర్‌ కుశాల్‌ మల్లా సంచలన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 34 బంతుల్లోనే శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో తక్కువ బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు చేశాడు.

తద్వారా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సౌతాఫ్రికా స్టార్‌ డేవిడ్‌ మిల్లర్‌(35 బాల్స్‌ సెంచరీ) పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. మంగోలియాతో మ్యాచ్‌ సందర్భంగా చైనా వేదికగా బుధవారం ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

మెన్స్‌ క్రికెట్‌ ఈవెంట్‌ మొదలు
కాగా ఆసియా క్రీడల్లో భాగంగా బుధవారం నేపాల్‌, మంగోలియా హొంగ్జూలోని పిన్‌ఫెంగ్‌ క్యాంపస్‌ క్రికెట్‌ ఫీల్డ్‌లో పోటీకి దిగాయి. గ్రూప్‌-ఏలో భాగమైన ఈ జట్ల మధ్య పోరుతో మెన్స్‌ టీ20 క్రికెట్‌ ఈవెంట్‌కు తెరలేచింది. టాస్‌ గెలిచిన మంగోలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో నేపాల్‌ ఓపెనర్లు విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కుశాల్‌ మల్లా 50 బంతుల్లో 137, ఐదో స్థానంలో వచ్చిన దీపేంద్ర సింగ్‌ ఆరీ 10 బంతుల్లో 52 పరుగులతో సంచలన ఇన్నింగ్స్‌ ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి నేపాల్‌ 314 పరుగులు చేసింది.

చదవండి: పసికూనపై ఇంగ్లండ్‌ ప్రతాపం​.. ఫిలిప్‌ సాల్ట్‌ విధ్వంసం​.. 28 బంతుల్లోనే..!

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)