Breaking News

#lndVsSL: టాస్‌ గెలిచిన శ్రీలంక.. అక్షర్‌ అవుట్‌.. వాషీ ఇన్! తుదిజట్లు ఇవే

Published on Sun, 09/17/2023 - 14:34

Asia Cup Final 2023- ndia vs Sri Lanka Playing XI: ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా ఆర్‌. ప్రేమదాస స్టేడియంలో టీమిండియా- శ్రీలంక టైటిల్‌ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

అక్షర్‌ పటేల్‌ అవుట్‌.. వాషీ ఇన్‌
ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కు తుదిజట్టులో చోటు దక్కింది.

తీక్షణ స్థానంలో అతడే
మరోవైపు.. స్టార్‌ స్పిన్నర్‌ మహీశ్‌ తీక్షణ గాయంతో వైదొలగడంతో దుషాన్‌ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక సారథి దసున్‌ షనక వెల్లడించాడు.  ఆరంభంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్‌ చేయాలనుకున్నట్లువెల్లడించాడు.

కాగా రోహిత్‌ శర్మ సైతం.. తాము టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్‌-2023లో కొలంబో వేదికగా ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం విశేషం.

తుదిజట్లు ఇవే
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక:
కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా.

చదవండి: బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్‌ మాజీ క్రికెటర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)