Breaking News

‘టీమిండియా మ్యాచ్‌ ఫిక్స్‌ చేశారు’.. మండిపడ్డ అక్తర్‌! మనోళ్లకు చేతకాదు..

Published on Wed, 09/13/2023 - 15:03

Asia Cup 2023- India vs Sri Lanka: ‘‘అసలు మీరేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇండియా మ్యాచ్‌ ఫిక్స్‌ చేసిందంటూ నాకు మీమ్స్‌తో కూడిన మెసేజ్‌లు వచ్చిపడుతున్నాయి. పాకిస్తాన్‌ను రేసు నుంచి తప్పించేందుకు టీమిండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతుందనేది వాటి సారాంశం.

మీరంతా బాగానే ఉన్నారు కదా? అసలు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? శ్రీలంక బౌలర్లు శక్తిని కూడదీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. వెల్లలలగే, అసలంక కఠినంగా శ్రమించారు.

20 ఏళ్ల పిల్లాడి పట్టుదల చూశారా?
ఆ 20 ఏళ్ల పిల్లాడి తాపత్రయాన్ని మీరు చూశారా? 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇదంతా చూస్తూ ఉన్నా.. ఇండియా నుంచి, ఇతర దేశాల అభిమానుల నుంచి నాకు ఒకటే ఫోన్‌ కాల్స్‌. ఈరోజు ఇండియా కావాలనే ఓడిపోతుందని ఒకటే వాగడం’’ అంటూ పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే పోరాటం చూసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడగలిగారో అర్థం కావడం లేదంటూ సోకాల్డ్‌ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో పాకిస్తాన్‌ను 228 పరుగులతో చిత్తు చేసిన భారత జట్టు.. మంగళవారం శ్రీలంకతో తలపడింది.

తిప్పేసిన స్పిన్నర్లు
ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్‌ చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొలంబోలో రోహిత్‌ సేన ఎలాంటి పొరపాటు చేయలేదు. పాక్‌తో మ్యాచ్‌ ముగిసిన 15 గంటల్లోపే మళ్లీ మైదానంలో దిగిన టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో లంక స్పిన్నర్లు వెల్లలగే, చరిత్‌ అసలంక ధాటికి 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వెల్లలగే బంతిని తిప్పేసి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. 

టీమిండియా- లంక ఫలితంపై
అయితే, లక్ష్య ఛేదనలో లంక 172 పరుగులకే ఆలౌట్‌ కావడంతో అతడి పోరాటం వృథాగా పోయింది. 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నేరుగా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గ్రూప్‌-ఏలో భారత జట్టుతో పాటు ఉన్న పాకిస్తాన్‌కు ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. లంకను రోహిత్‌ సేన ఓడించాల్సిందే!

ఈ నేపథ్యంలోనే కొంతమంది టీమిండియా టాపార్డర్‌ విఫలం కావడం చూసి.. లంకను గెలిపించి పాక్‌ను రేసు నుంచి తప్పించేందుకు ఇలా ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయమై తనకు కాల్స్‌ వచ్చాయని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తెలిపాడు.

వాళ్లంతా కష్టపడ్డారు.. మనోళ్లకు చేతకాదు
‘‘వాళ్లు ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. అసలు టీమిండియా ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుంది? గెలిస్తే ఎంచక్కా ఫైనల్‌ చేరే అవకాశాన్ని ఎందుకు మిస్‌ చేసుకుంటుంది? ఎలాంటి కారణాలు లేకుండా ఇలాంటి పిచ్చిపని ఎందుకు చేయాలనుకుంటుంది? 

లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడారు. కుల్దీప్‌ అద్భుతం చేశాడు. జట్టును గెలిపించేందుకు జస్‌ప్రీత్‌ బుమ్రా శక్తిమేర కష్టపడ్డాడు. ఇక లంక కుర్రాడు వెల్లలగే బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండూ చేయగలడు. కానీ మన వాళ్ల సంగతి వేరు. వాళ్ల నుంచి ఇలాంటి పోరాటం ఎప్పుడూ చూడలేదు.

మన ఫాస్ట్‌బౌలర్లు షాహిన్‌ ఆఫ్రిది, హ్యారిస్‌ రవూఫ్‌, నసీం షా 10 ఓవర్లు బౌలింగ్‌ చేసినా గాయపడకుండా ఉంటే చూడాలని ఉంది. మన వాళ్లు కూడా పోరాటపటిమ కనబరచాలి’’ అని అక్తర్‌ వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తేనే ఫైనల్‌ బెర్తు ఖరారవుతుంది.   

చదవండి: టీమిండియాకు షాక్‌.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్‌! రేసులో అతడు కూడా!
5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్‌ వెల్లలగే?

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)