Breaking News

పాక్‌తో డూ ఆర్‌ డై మ్యాచ్‌కు ముందు శ్రీలంక జట్టుకు భారీ ఎదురుదెబ్బ

Published on Tue, 09/23/2025 - 19:10

ఆసియా కప్‌ 2025లో (Asia cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో (Bangladesh Vs Sri Lanka) ఇవాళ (సెప్టెంబర్‌ 23) జరుగబోయే 'డూ ఆర్‌ డై' మ్యాచ్‌కు (సూపర్‌-4) ముందు శ్రీలంక జట్టుకు (Sri Lanka) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్‌ మతీష పతిరణ (Matheesha Pathirana) ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. పతిరణ గాయం కారణంగా శ్రీలంక ఆడిన గత రెండు మ్యాచ్‌లకు కూడా దూరం ఉన్నాడు. 

అయితే అతను కీలకమై పాక్‌ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని లంక మేనేజ్‌మెంట్‌ భావించింది. అతని గాయం ఇంకా తగ్గకపోవడంతో నేటి పాక్‌ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల ముందు అధికారికంగా ప్రకటించింది. 

అబుదాబీలో నేడు పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌కు పతిరణ లంక మేనేజ్‌మెంట్‌ పరిశీలనలో ఉన్నాడు. అబుదాబీ పిచ్‌కు పేసర్లకు సహకరించే స్వభావం ఉండటంతో వారు పతిరణపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే పతిరణ గాయం మానకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి.

నేటి మ్యాచ్‌ శ్రీలంకతో సహా పాక్‌కు కూడా అత్యంత కీలకం. ఇరు జట్లు సూపర్‌-4లో తమ తొలి మ్యాచ్‌ల్లో (పాక్‌ భారత్‌ చేతిలో, శ్రీలంక బంగ్లాదేశ్‌ చేతిలో ఓడాయి) పరాజయాలపాలయ్యారు. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ఫైనల్స్‌ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరు జట్లకు నేటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టు దాదాపుగా ఫైనల్స్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే.

చదవండి: ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)