Asia cup 2025: చరిత్ర సృష్టించిన లిట్టన్‌ దాస్‌.. అడుగు దూరంలో ముస్తాఫిజుర్‌

Published on Sun, 09/21/2025 - 17:08

ఆసియా కప్‌ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 20) జరిగిన తొలి సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించింది. తొలుత శ్రీలంక బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ మరో బంతి మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌ చరిత్ర సృష్టించాడు.  బంగ్లాదేశ్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ను వెనక్కు నెట్టి ఈ ఘనత సాధించాడు.

షకీబ్‌ 129 మ్యాచ్‌ల్లో 13 హాఫ్‌ సెంచరీల సాయంతో 2551 పరుగులు చేయగా.. దాస్‌ 114 మ్యాచ్‌ల్లో 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 2556 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (4231) పేరిట ఉంది.

ముస్తాఫిజుర్‌ మరో వికెట్‌ దూరంలో..!
శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు వరకు బంగ్లాదేశ్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డులు షకీబ్‌ అల్‌ హసన్‌ పేరిట సోలోగా ఉండేవి. ఈ మ్యాచ్‌లో షకీబ్‌ పేరిట ఉండిన అత్యధిక పరుగుల రికార్డును లిట్టన్‌ దాస్‌ బద్దలు కొట్టగా.. ఇదే మ్యాచ్‌లో షకీబ్‌ పేరిటే ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ సమం చేశాడు. 

లంకతో మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన తర్వాత ముస్తాఫిజుర్‌, షకీబ్‌ తలో 149 వికెట్లతో సమంగా ఉన్నారు.  ముస్తాఫిజుర్‌ మరో వికెట్‌ తీస్తే బంగ్లాదేశ్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరిస్తాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)