Breaking News

Asia Cup 2025: భారత్‌తో సూపర్‌-4 మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ పంచ్‌..!

Published on Sat, 09/20/2025 - 16:55

ఆసియా కప్‌ 2025లో భాగంగా రేపు (సెప్టెంబర్‌ 21) భారత్‌, పాకిస్తాన్‌ మధ్య సూపర్‌-4 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ పంచ్‌ పడినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీలో భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ సందర్భంగా చోటు చేసుకున్న షేక్‌ హ్యాండ్‌ వివాదంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను టార్గె​ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు కరచాలనం​ ఇవ్వలేదు (టాస్‌ సందర్భంగా, మ్యాచ్‌ అయిపోయాక). దీన్ని అవమానంగా భావించిన పీసీబీ భారత ఆటగాళ్లను ఏమీ చేసుకోలేక, మ్యాచ్‌ రిఫరీ పైక్రాఫ్ట్‌పై పడింది. పైక్రాఫ్ట్‌ భారత ఆటగాళ్ల పట్ల పక్షపాతంగా (తమ ఆటగాళ్లు పాక్‌ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వరన్న భారత మేనేజ్‌మెంట్‌ సందేశాన్ని పాక్‌ కెప్టెన్‌కు చేరవేశాడని) వ్యవహరించి, క్రీడాస్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడని ఆరోపించింది.

ఈ విషయాన్ని హైలైట్‌ చేస్తూ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఐసీసీకి పలు లేఖలు రాసింది. యూఏఈతో మ్యాచ్‌కు ముందు ఓ అడుగు ముందుకేసి బాయ్‌కాట్‌ బెదిరింపులకు దిగింది. ఐసీసీ కన్నెర్ర చేయడంతో కనీసం తమ మ్యాచ్‌లకైనా పైక్రాఫ్ట్‌ను పక్కన పెట్టాలని కాళ్ల బేరానికి వచ్చింది.

పీసీబీ ఉడత ఊపులను, డిమాండ్లను తోసిపుచ్చిన ఐసీసీ, పైక్రాఫ్ట్‌కు మద్దతుగా నిలిచింది. అతన్నే యూఏఈతో మ్యాచ్‌కు రిఫరీగా కొనసాగించింది. ఒకవేళ పాక్‌ జట్టు ఆసియా కప్‌ను బాయ్‌కాట్‌ చేయాలనుకుంటే భారీ మొత్తంలో నగదు చెల్లించాలని రివర్స్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఇంతటితో ఆగకుండా తాజాగా మరో షాక్‌ ఇచ్చింది.

గత మ్యాచ్‌ తాలూకా గాయాలు తగ్గకముందే రేపు భారత్‌తో జరుగబోయే సూపర్‌-4 మ్యాచ్‌కు మరోసారి పైక్రాఫ్ట్‌నే రిఫరీగా నియమించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ మేరకు ఐసీసీ ఇదివరకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ కొట్టిన ఈ చావుదెబ్బకు సూపర్‌-4 మ్యాచ్‌కు ముందే పాక్‌ ఢీలా పడిపోయింది. 

కాగా, రేపటి భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)