Breaking News

Asia Cup 2023: సెంచరీ చేజార్చుకున్న మెండిస్‌.. శ్రీలంక భారీ స్కోర్‌

Published on Tue, 09/05/2023 - 19:21

ఆసియా కప్‌-2023లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 5) జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. కుశాల్‌ మెండిస్‌ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) 8 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. పథుమ్‌ నిస్సంక (40 బంతుల్లో 41; 6 ఫోర్లు), అసలంక (43 బంతుల్లో 36; 2 ఫోర్లు, సిక్స్‌), దునిత్‌ వెల్లెలెగె (39 బంతుల్లో 33 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), కరుణరత్నే (35 బంతుల్లో 32; 6 ఫోర్లు), తీక్షణ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.

లంక ఇన్నింగ్స్‌లో సమరవిక్రమ (3), కెప్టెన్‌ షనక (5) మాత్రమే విఫలమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో గుల్బదిన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్‌ 2, ముజీబ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ 2.2 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టపోయి 10 పరుగులు చేసింది. కసున్‌ రజిత బౌలింగ్‌లో కుశాల్‌ మెండిస్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానుల్లా గుర్భాజ్‌ (4) ఔటయ్యాడు. ఇబ్రహీం జద్రాన్‌ (6), గుల్బదిన్‌ నైబ్‌ క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌-బి నుంచి సూపర్‌-4కు చేరుకుంటుంది. ఈ గ్రూప్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఇదివరకే సూపర్‌-4కు అర్హత సాధించగా.. గ్రూప్‌-ఏ నుంచి పాకిస్తాన్‌, భారత్‌లు సూపర్‌-4కు చేరుకున్నాయి. 
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)