Breaking News

Asia Cup 2023: మొహమ్మద్‌ నబీ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు

Published on Tue, 09/05/2023 - 21:56

ఆఫ్ఘనిస్తాన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ మొహమ్మద్‌ నబీ రికార్డు హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలకమైన మ్యాచ్‌లో నబీ విధ్వంసకర అర్ధశతకంతో విరుచుకుపడ్డాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి, ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.

ఈ ఇన్నింగ్స్‌కు ముందు ఈ రికార్డు ముజీబ్‌ పేరిట ఉండేది. ముజీబ్‌ ఇదే ఏడాది పాక్‌పై 26 బంతుల్లో హాఫ్‌ సెంచరీ బాదాడు. అంతకుముందు రషీద్‌ ఖాన్‌ (27 బంతుల్లో), మొహ్మమద్‌ నబీ (28), షఫీకుల్లా షిన్వారి (28) ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున వన్డేల్లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీలు చేశారు. 

ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా 292 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌ ఒక్కసారిగా ట్రాక్‌ మార్చుకుని గెలుపుబాట పట్టింది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. కుశాల్‌ మెండిస్‌ (84 బంతుల్లో 92; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. పథుమ్‌ నిస్సంక (41), అసలంక (36), దునిత్‌ వెల్లెలెగె (33 నాటౌట్‌), కరుణరత్నే (32), తీక్షణ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో గుల్బదిన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ఖాన్‌ 2, ముజీబ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ నబీ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకపడటంతో 31 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 234 పరుగులు చేసి, విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)