Breaking News

క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘనత సాధించిన విరాట్‌ కోహ్లి

Published on Wed, 09/13/2023 - 18:23

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచ క్రికెట్‌లో అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లు) 300 విజయాల్లో భాగమైన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా నిన్న (సెప్టెంబర్‌ 12) జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించడం ద్వారా కోహ్లి ఈ ఘనతను సాధించాడు.

ప్రపంచ క్రికెట్‌లో కోహ్లికి ముందు కేవలం ఐదుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఈ జాబితాలో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అత్యధికంగా 377 విజయాలు సాధించాడు. ఆతర్వాత లంక లెజెండ్‌ మహేళ జయవర్ధనే (336), క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (307), సౌతాఫ్రికన్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జాక్‌ కల్లిస్‌ (305), లంక లెజెండ్‌ కుమార సంగక్కర (305) ఉన్నారు. 

ఇదిలా ఉంటే, లంకతో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా ఆసియా కప్‌-2023 ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసిన తక్కువ స్కోర్‌ను డిఫెండ్‌ చేశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53), కేఎల్‌ రాహుల్‌ (39), ఇషాన్‌ కిషన్‌ (33), అక్షర్‌ పటేల్‌ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. లంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే (5/40), చరిత్‌ అసలంక (4/18) టీమిండియా పతనాన్ని శాశించారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌ (4/43), బుమ్రా (2/30), జడేజా (2/33), సిరాజ్‌ (1/17), హార్ధిక్‌ పాండ్యా (1/14) కకావికలం చేశారు. వీరి ధాటికి లంకేయులు 41.3 ఓవర్లలో 172 పరుగులకు చాపచుట్టేశారు. లంక ఇన్నింగ్స్‌లో దునిత్‌ వెల్లలగే (42 నాటౌట్‌) ఒక్కడే పోరాడాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)