Breaking News

Ind Vs SL: ప్రతి బంతికి వికెట్‌ తీయాలనుకుంటాడు.. అతడు అద్భుతం: రోహిత్‌

Published on Wed, 09/13/2023 - 08:42

Asia Cup 2023- India vs Sri Lanka, Super Fours- Rohit Sharma Comments: ‘‘ఇలాంటి చాలెంజింగ్‌ పిచ్‌పై.. తీవ్రమైన ఒత్తిడితో కూడిన సందర్భంలోనూ రాణించడం సంతోషాన్నిచ్చింది. నిజానికి.. ఇలాంటి పిచ్‌లపై ఆడినపుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది. మ్యాచ్‌ అద్భుతంగా సాగింది’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. బౌలర్లు మెరుగ్గా రాణించారని కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యాలను ప్రశంసించాడు.

వెల్లలగే ఆకాశమే హద్దుగా
కాగా ఆసియా కప్‌-2023 సూపర్‌-4 దశలో భాగంగా మంగళవారం భారత జట్టు శ్రీలంకతో తలపడింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. పాకిస్తాన్‌పై భారీ విజయం తర్వాత 15 గంటల్లోపే తిరిగి ఆరంభమైన ఈ మ్యాచ్‌లో.. రోహిత్‌ సేన 49.1 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

స్పిన్‌కు అనుకూలించిన కొలంబో పిచ్‌పై లంక లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే ఆకాశమే హద్దుగా చెలరేగి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక చరిత్‌ అసలంక సైతం నాలుగు, తీక్షణ ఒక వికెట్‌ తీశారు.


జడేజా, కుల్దీప్‌

కుల్దీప్‌ నాలుగు వికెట్లతో..
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా రెండు, మహ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌పాండ్యా ఒక్కో వికెట్‌ పడగొట్టగా.. స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ అత్యధికంగా నాలుగు, రవీంద్ర జడేజా రెండు వికెట్లు కూల్చారు. దీంతో 41 పరుగులతో గెలుపొందిన టీమిండియా ఆసియా కప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

వాళ్ల వల్లే గెలిచాం
ఈ నేపథ్యంలో విజయంపై స్పందించిన రోహిత్‌ శర్మ కొలంబో పిచ్‌ తమకు సవాల్‌ విసిరిందని పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్‌పై 213 పరుగుల స్కోరును డిఫెండ్‌ చేయడం తేలిక కాదని.. ఏదేమైనా తమ బౌలర్లు మెరుగ్గా రాణించడం వల్లే గెలుపు సాధ్యమైందని తెలిపాడు. 

ప్రతి బంతికి వికెట్‌ తీయాలనుకుంటాడు
ముఖ్యంగా హార్దిక్‌ పాండ్యా ప్రతి బంతికి వికెట్‌ తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాడంటూ కొనియాడాడు. రాత్రికి రాత్రే మార్పులు రావని.. గత రెండేళ్లుగా బౌలింగ్‌పై దృష్టి సారించిన పాండ్యా.. కఠినంగా శ్రమిస్తున్నాడని రోహిత్‌ పేర్కొన్నాడు.

అతడు అద్భుతం
ఇక చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ గతేడాది కాలంగా అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడన్న రోహిత్‌ శర్మ.. హార్డ్‌వర్క్‌తోనే అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని ప్రశంసించాడు. లోపాలు సరిచేసుకుని నూతనోత్సాహంతో దూసుకుపోతున్నాడంటూ కొనియాడాడు.

కాగా టీమిండియా- శ్రీలంక మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న లంక స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.​ ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అర్ధ శతకం(53) సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్‌ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)