Breaking News

షాహిద్‌ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ

Published on Tue, 09/12/2023 - 16:27

Asia Cup, 2023 India vs Sri Lanka, Super 4- Rohit Sharma: శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. బౌండరీ బాది యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా ఫిఫ్టీ పూర్తి చేసుకునేసరికి రోహిత్‌ ఖాతాలో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

హిట్‌మ్యాన్‌ రికార్డు
ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్‌ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ శర్మ బద్దలుకొట్టాడు.

దెబ్బకొట్టిన వెల్లలగే
కాగా ఆసియా కప్‌-2023 సూపర్‌ 4 దశలో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంకతో టీమిండియా మంగళవారం నాటి మ్యాచ్‌లో తలపడుతోంది. ఇందులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 53, గిల్‌ 19 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచాడు. కాగా టీమిండియా ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లను లంక యువ బౌలర్‌, లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే తన ఖాతాలో వేసుకోవడం విశేషం.

ఆసియా వన్డే కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే!
►రోహిత్‌ శర్మ-28
►షాహిద్‌ ఆఫ్రిది- 26
►సనత్‌ జయసూర్య- 23
►సురేశ్‌ రైనా- 18 .

చదవండి: Ind vs SL: నా 15 ఏళ్ల కెరీర్‌లో ఇదే మొదటిసారి.. అప్పటికి నాకు 35: కోహ్లి

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)