Breaking News

Ind Vs Pak: షమీకి నో ఛాన్స్‌.. అందుకే ముందు బ్యాటింగ్‌: రోహిత్‌ శర్మ

Published on Sat, 09/02/2023 - 15:08

Asia Cup, 2023 Pakistan vs India- Toss- Rohit Sharma Comments: ‘‘మేము ముందు బ్యాటింగే చేస్తాం. వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయం గురించి ఎవరూ ఏమీ చెప్పలేరు కదా! మేము ఇక్కడికి క్రికెట్‌ ఆడటానికి వచ్చాం.సవాళ్లు, కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తప్పకుండా సిద్ధంగా ఉండాలి. వెస్టిండీస్‌ పర్యటన తర్వాత మాకు కావాల్సినంత సమయం దొరికింది. 

బెంగళూరులో మా ఆటగాళ్లంతా కఠినంగా శ్రమించారు. ఈ టోర్నీలో మా ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ప్రత్యర్థి జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఏదేమైనా.. జట్టుగా మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సి ఉంది. అయ్యర్‌, బుమ్రా తిరిగి వచ్చారు. ఈరోజు ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం’’ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో ప్రయాణం ఆరంభం
పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యామని పేర్కొన్నాడు. ఆసియా కప్‌-2023లో భారత్‌.. దాయాది పాక్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇందుకు వేదిక అయింది.

ఆశ్చర్యపరిచిన రోహిత్‌ నిర్ణయం
ఈ క్రమంలో శనివారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. పిచ్‌ బౌలర్లకు అనుకూలిస్తుందన్న అభిప్రాయాల నేపథ్యంలో టాస్‌ గెలిచిన కెప్టెన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంటాడని అంతా భావించారు.

కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రోహిత్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం విశేషం. సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధపడే బ్యాటింగ్‌ చేశామని హిట్‌మ్యాన్‌ ధీమాగా ఉన్నప్పటికీ.. వర్షం ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందోనని అభిమానులు ఆందోళన పడుతున్నారు.

షమీకి నో ఛాన్స్‌
కాగా క్యాండీలోని హై క్వాలిటీ పిచ్‌పై బౌలర్లు లేదంటే బ్యాటర్లు.. ఎవరు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చకుంటే వారికే మేలు చేకూర్చే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ హైవోల్టేజీ వన్డేలో శార్దూల్‌ ఠాకూర్‌కు అవకాశమిచ్చిన మేనేజ్‌మెంట్‌ టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని పక్కనపెట్టింది.

ఆసియా కప్‌-2023 పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

చదవండి: మా దగ్గర షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌ లేరు.. అదే ప్లస్‌: రోహిత్‌ శర్మ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)