Breaking News

మా దగ్గర షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌ లేరు.. అదే ప్లస్‌: రోహిత్‌ శర్మ

Published on Fri, 09/01/2023 - 21:04

మీడియా సమావేశంలో చిరాకు తెప్పించే ప్రశ్నలకు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనదైన శైలిలో కౌంటర్‌ ఇస్తూ ఉంటాడు. గతంలో విరాట్‌ కోహ్లితో విభేదాలు, మేజర్‌ ఈవెంట్లలో భారత జట్టు చేతులెత్తేయడం గురించి ప్రశ్నించిన వారితో పాటు.. బయటివాళ్ల మాటలు తమకు పట్టవంటూ విమర్శకులకూ గట్టిగానే బదులిచ్చాడు. తాజాగా మరోసారి హిట్‌మ్యాన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురుకాగా.. మాటల ‘బౌన్సర్‌’ సంధించాడు.

ఆసియా కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌కు అభిమానుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేక​ంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు దేశాలతో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం దాయాదుల పోరు కోసం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు.

టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా ఉంటే.. పాకిస్తాన్‌కు తమ పేస్‌ దళమే ప్రధాన బలం. కాబట్టి ఎప్పటిలాగే ఈసారి కూడా భారత బ్యాటింగ్‌- పాక్‌ బౌలింగ్‌ మధ్య హోరాహోరీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా శనివారం ఈ హైపర్‌ టెన్షన్‌ మ్యాచ్‌ జరుగనుంది.

ఈ నేపథ్యంలో భారత జట్టు సారథి రోహిత్‌ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాక్‌ పేస్‌ త్రయాన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నెట్స్‌లో షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా లేదంటే హ్యారిస్‌ రవూఫ్‌.. వీరిలో ఎవరూ కూడా మాకు బౌలింగ్‌ చేయలేదు కదా!

మా బౌలర్లతోనే మేము ప్రాక్టీస్‌ చేస్తాం. మా దగ్గర నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. రేపటి మ్యాచ్‌లో కేవలం మా అనుభవమే అక్కరకు వస్తుంది’’ అని రోహిత్‌ కౌంటర్‌ ఇచ్చాడు. ప్రధాన పేసర్‌ జస్‌‍ప్రీత్‌ బుమ్రా రాక తమకు సానుకూలాంశంగా మారిందన్న హిట్‌మ్యాన్‌.. ‘‘ప్రస్తుతం మా జట్టులో ఆరుగురు గొప్ప బౌలర్లు అందుబాటులో ఉన్నారు.

ఐర్లాండ్‌ పర్యటనతో పునరాగమనం చేసిన బుమ్రా పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడు. బెంగళూరు ట్రెయినింగ్‌ క్యాంపులోనూ మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. ముగ్గురు పేసర్లూ ఫిట్‌గా ఉండటం కలిసి వస్తుంది. మాకు ఇది గొప్ప సానుకూల అంశం’’ అని చెప్పుకొచ్చాడు. బుమ్రాతో పాటు షమీ, సిరాజ్‌లు కూడా రాణిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)