Breaking News

IND VS BAN: అరుదైన ఘనత సాధించిన రవీంద్ర జడేజా

Published on Fri, 09/15/2023 - 18:23

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ప్లేయర్‌గా, వన్డేల్లో భారత్‌ తరఫున కపిల్‌ (3783 పరుగులు, 253 వికెట్లు)  తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, భారత్‌ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్కును అందుకున్న ఏడో బౌలర్‌గా (337 వన్డే వికెట్లతో కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు) రికార్డుల్లోకెక్కాడు. 

ఆసియా కప్‌-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 15) జరుగుతున్న మ్యాచ్‌లో షమీమ్‌ హొస్సేన్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా జడ్డూ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో 182వ వన్డే ఆడుతున్న జడ్డూ.. 200 వికెట్లతో పాటు 2578 పరుగులు చేశాడు. 

కాగా, కొలొంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పట్టుబిగించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి భారత్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న బంగ్లాదేశ్‌.. 45 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. షకీబ్‌ (80), తౌహిద్‌ హ్రిదోయ్‌ (54) అర్ధసెంచరీలతో రాణించగా.. తంజిద్‌ హసన్‌ (13), లిటన్‌ దాస్‌ (0), అనాముల్‌ హాక్‌ (4), మెహిది హసన్‌ (13), షమీమ్‌ హొస్సేన్‌ (1) విఫలమయ్యారు. నసుమ్‌ అహ్మద్‌ (35), మెహిది హసన్‌ (13) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. షమీ 2, అక్షర్‌, జడేజా తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)