Breaking News

ఆసియా కప్‌-2023 ఫైనల్లో భారత్‌, పాక్‌..?

Published on Wed, 09/13/2023 - 18:49

ఆసియా కప్‌-2023లో భారత్‌-పాక్‌లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉంది. తొలుత ఈ రెండు జట్లు గ్రూప్‌ దశలో తలపడగా.. ఆ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఆతర్వాత ఇరు జట్లు మరోసారి సూపర్‌-4 స్టేజీలో ఎదురెదురుపడ్డాయి. అప్పుడు టీమిండియా.. పాక్‌ను 228 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ప్రస్తుత సమీకరణల ప్రకారం భారత్‌, పాక్‌లు మరోసారి తలపడే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 17న కొలొంబోలో జరిగే ఫైనల్లో మరోమారు దాయాదుల పోరు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

అయితే, ఇది జరగాలంటే రేపు (సెప్టెంబర్‌ 14) శ్రీలంకతో జరుగబోయే గ్రూప్‌-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తప్పక గెలవాల్సి ఉంటుంది. గెలుపు తప్ప వేరే ఏ ఇతర ఫలితం వచ్చినా, పాక్‌ ఫైనల్‌కు చేరదు. ఎందుకంటే ప్రస్తుతం పాక్‌ (-1.892) కంటే శ్రీలంకకు (-0.200) మెరుగైన రన్‌రేట్‌ ఉంది. ఒకవేళ వర్షం​ కారణంగా ఈ మ్యాచ్‌ రద్దైతే మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా శ్రీలంక ఫైనల్‌కు చేరుకుంటుంది.

మరోవైపు భారత్‌ ఇంకో మ్యాచ్‌ (బంగ్లాదేశ్‌తో) ఆడాల్సి ఉండగానే ఫైనల్‌కు చేరుకుంది. పాక్‌, శ్రీలంకలపై వరుస విజయాలతో భారత్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నప్పటికీ, రెండు మ్యాచ్‌ల్లో ఓడిన కారణంగా బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాబట్టి కొలొంబో వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ తప్పక గెలిస్తేనే, ఫైనల్లో దాయాదుల పోరు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో రేపటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాకుండా ఉండాలని, అలాగే లంకపై పాక్‌ గెలవాలని  భారత అభిమానులు కోరుకుంటున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)