Breaking News

అశ్విన్‌-జడేజాల ముంగిట వరల్డ్‌ రికార్డు.. మరో 3 వికెట్లు తీస్తే..!

Published on Sun, 07/23/2023 - 17:24

భారత స్పిన్‌ ద్వయం రవిచంద్రన్‌ అశ్విన్‌-రవీంద్ర జడేజాల కోసం ఓ వరల్డ్‌ రికార్డు కాసుకు కూర్చుంది. ఈ స్పిన్‌ ద్వయం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ నాలుగో రోజు మరో 3 వికెట్లు పడగొడితే టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్‌ ద్వయంగా రికార్డుల్లోకెక్కుతుంది. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు టెస్ట్‌ల్లో 49 మ్యాచ్‌ల్లో 498 వికెట్లు పడగొట్టారు.

వీరికి ముందు భారత మాజీ స్పిన్‌ ద్వయం అనిల్‌ కుంబ్లే-హర్భజన్‌ సింగ్‌ 54 మ్యాచ్‌ల్లో 501 వికెట్లు పడగొట్టారు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన స్పిన్‌ ద్వయం రికార్డు కుంబ్లే-భజ్జీ జోడీ పేరిట ఉంది. విండీస్‌తో నేటి మ్యాచ్‌లో అశ్విన్‌-జడేజా ఇద్దరు కలిసి మరో 3 వికెట్లు పడగొడితే, కుంబ్లే-భజ్జీ జోడీని వెనక్కునెట్టి టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్‌ ద్వయం రికార్డును వారి ఖాతాలో వేసుకుంటారు.

ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జోడీ రికార్డు ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ పెయిర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌-స్టువర్ట్‌ బ్రాడ్‌ పేరిట ఉంది. వీరిద్దరు కలిసి 137 టెస్ట్‌ల్లో 1034 వికెట్లు పడగొట్టారు. వీరి తర్వాత షేన్‌ వార్న్‌-గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ ద్వయం ఉంది. వీరు 104 మ్యాచ్‌ల్లో 1001 వికెట్లు సాధించారు. ఈ జాబితాలో ప్రస్తుతం కుంబ్లే-భజ్జీ జోడీ 11వ స్థానంలో.. అశ్విన్‌-జడేజా జోడీ 12వ స్థానంలో ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌ (75), తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ (33), కిర్క్‌ మెక్‌కెంజీ (32), జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (20), జాషువ డిసిల్వ (10) ఔట​్‌ కాగా.. అలిక్‌ అథనేజ్‌ (37), జేసన్‌ హోల్డర్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముకేశ్‌ కుమార్‌, సిరాజ్‌, అశ్విన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది. 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న విరాట్‌ కోహ్లి (121) సెంచరీతో కదంతొక్కగా.. యశస్వి (57), రోహిత్‌ (80), జడేజా (61), అశ్విన్‌ (56)అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌, వార్రికన్‌ చెరో 3 వికెట్లు.. హోల్డర్‌ 2, గాబ్రియల్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)