Breaking News

ఇంగ్లండ్‌పై ‘సెంచరీ’ కొట్టిన అశ్విన్‌.. వీడియో వైరల్‌

Published on Fri, 02/23/2024 - 12:13

India vs England, 4th Test : టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెరీర్‌లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌ టెస్టు సిరీస్‌ సందర్భంగా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన ఈ రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్‌.. రాంచి మ్యాచ్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు.

టెస్టు ఫార్మాట్లో ఒకే ప్రత్యర్థిపై 1000 పరుగులు చేయడం సహా 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌ చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.

అశ్విన్‌ కంటే ముందు వాళ్లు
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా జానీ బెయిర్‌స్టోను అవుట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. అశ్విన్‌ కంటే ముందు జార్జ్‌ జిఫెన్‌(ఇంగ్లండ్‌ మీద), మోనీ నోబుల్‌(ఇంగ్లండ్‌ మీద), విల్ఫ్రెడ్‌ రోడ్స్‌(ఆస్ట్రేలియా మీద), గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌(ఇంగ్లండ్‌ మీద), ఇయాన్‌ బోతం(ఆస్ట్రేలియా మీద), స్టువర్ట్‌ బ్రాడ్‌(ఆస్ట్రేలియా మీద) టెస్టుల్లో ఈ ఫీట్‌ నమోదు చేశారు.

కాగా రాంచి వేదికగా టీమిండియాతో నాలుగో టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తోంది. భోజన విరామ సమయానికి 24.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు స్కోరు చేసింది. టీమిండియా బౌలర్లలో అరంగేట్ర పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ టాపార్డర్‌ను కుప్పకూల్చి మూడు వికెట్లు వికెట్లు తీయగా.. అశ్విన్‌, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

చదవండి: IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్‌ దీప్‌?

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)