Breaking News

Ashes: అత్యంత అరుదైన రికార్డు

Published on Wed, 01/07/2026 - 18:47

ఇంగ్లండ్‌ యువ క్రికెటర్‌ జేకబ్‌ బెతెల్‌ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్‌లో సాధించిన తొలి టెస్టు సెంచరీతోనే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ సరసన చేరాడు.

యాషెస్‌ సిరీస్‌ 2025-26 (Ashes)లో భాగంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆతిథ్య ఆసీస్‌ తొలి మూడు టెస్టులు గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోగా.. నాలుగో మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది.

సిడ్నీలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇందుకు ఆసీస్‌ ధీటుగా బదులిచ్చింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 567 పరుగులు సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లిష్‌ జట్టు.. బుధవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది.

జేకబ్‌ బెతెల్‌ సెంచరీతో
ఇందుకు ప్రధాన కారణం జేకబ్‌ బెతెల్‌ (Jacob Bethell) ఇన్నింగ్స్‌. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 232 బంతులు ఎదుర్కొని.. పదిహేను ఫోర్లు బాది 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన కెరీర్‌లో టెస్టుల్లో తొలి సెంచరీ బాదిన 22 ఏళ్ల బెతెల్‌ అరుదైన ఘనతలు సాధించాడు.

కపిల్‌ దేవ్‌ సరసన
కాగా బెతెల్‌ 2024లో సౌతాఫ్రికాతో వన్డేల్లో తొలి శతకం బాదాడు. తాజాగా యాషెస్‌లో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో మొదటిసారి శతక్కొట్టాడు. తద్వారా తన కెరీర్‌లో ఫస్ట్‌ క్లాస్‌, లిస్ట్‌-ఎ సెంచరీలను అంతర్జాతీయ క్రికెట్‌లోనే నమోదు చేశాడు. దేశీ క్రికెట్‌లో అతడి ఖాతాలో ఇంత వరకు ఒక్క సెంచరీ లేదన్న మాట.

ఈ జాబితాలో టీమిండియా లెజెండ్‌ కపిల్‌ దేవ్‌తో పాటు వెస్టిండీస్‌కు చెందిన మార్లన్‌ సామ్యూల్స్‌, బంగ్లాదేశ్‌ ప్లేయర్‌ మెహిదీ హసన్‌ మిరాజ్‌, ఐర్లాండ్‌ ఆటగాడు కర్టిస్‌ కాంఫర్‌ ఉన్నారు. ఈ అరుదైన జాబితాలో తాజాగా చేరిన జేకబ్‌ బెతెల్‌.. ఈ ఘనత సాధించి తొట్టతొలి ఇంగ్లండ్‌ ప్లేయర్‌గా నిలిచాడు. దాదాపు 149 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ తరఫున ఈ రేర్‌ రికార్డు సాధించింది అతడే కావడం గమనార్హం. 

చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ.. వరల్డ్‌ రికార్డు

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి