Breaking News

Ashes 2023: బెయిర్‌స్టో స్టంపౌట్‌ ఉదంతం.. ప్రధాని సైతం స్పందించారు..!

Published on Tue, 07/04/2023 - 09:18

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వివాదాస్పద స్టంపౌట్‌పై క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే బ్రిటన్‌ ప్రధాని రిషి సునక్‌  స్పందించారు. బెయిర్‌స్టో విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. ఈ వివాదంపై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్పందనతో ఏకీభవించారు. ఆస్ట్రేలియా తరహాలో గేమ్‌ గెలవాలని తాను కోరుకోనని అన్నారు. ఆసీస్‌ వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాలను రిషి సునక్‌ ప్రతినిధి వెల్లడించారు. 

కాగా, యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్ట్‌ ఆఖరి రోజు ఆటలో బెయిర్‌స్టో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఔటైన విషయం తెలిసిందే. బంతి వికెట్‌కీపర్‌ చేతిలో ఉండగానే బెయిర్‌స్టో ఓవర్‌ పూర్తయ్యిందనుకుని క్రీజ్‌ దాటి వెళ్లాడు. ఇది గమనించిన వికెట్‌కీపర్‌ వికెట్లను గిరాటు వేశాడు. సుదీర్ఘ పరిశీలన అనంతరం ధర్డ్‌ అంపైర్‌ బెయిర్‌స్టోను స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదం రాజుకుంది.

నిబంధనల ప్రకారం ఇది ఔటే అయినా.. ఆసీస్‌ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసీస్‌ క్రీడాస్పూర్తికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అయితే తాము ఆసీస్‌ తరహాలో మ్యాచ్‌ గెలవాలని ఎప్పటికీ కోరుకోమని వ్యాఖ్యానించాడు. ఇదే విషయాన్ని తాజాగా బ్రిటన్‌ ప్రధాని కూడా వెల్లబుచ్చారు.

ఇదిలా ఉంటే, రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో కీలక సమయంలో ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆసీస్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్, ఆసీస్‌ మధ్య మూడో టెస్ట్ జులై 6 నుంచి హెడింగ్లీలో ప్రారంభమవుతుంది.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)