Breaking News

లబూషేన్‌ తొండాట.. చీటర్‌ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు  

Published on Tue, 06/20/2023 - 13:43

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ 2023 తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌ తొండాట ఆడాడు. నాలుగో రోజు ఆటలో షార్ట్‌ లెగ్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న అతను.. క్యాచ్‌ పట్టలేదని తెలిసినా సంబరాలు చేసుకుని ఇంగ్లండ్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇన్నింగ్స్‌ 55వ ఓవర్‌లో హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఓలీ రాబిన్సన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. 

రాబిన్సన్‌ రివ్యూకి వెళ్లగా బంతి నేలకు తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవ్వడంతో ఫ్యాన్స్‌ లబూషేన్‌ను ఏకిపారేస్తున్నారు. ఇలా ప్రవర్తించడం క్రీడా స్పూర్తికి వ్యతిరేకమని చురకలంటిస్తున్నారు. తొండాటకు ఆసీస్‌ ఆటగాళ్లు కేరాఫ్‌ అడ్రస్‌ అని విరుచుకుపడుతున్నారు.

ఇదిలా ఉంటే, యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్‌ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్‌ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్‌ అప్రోచ్‌ అని ఇంగ్లండ్‌ ఓవరాక్షన్‌ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. 

ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్‌ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్‌ సైతం బజ్‌బాల్‌ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)