Breaking News

ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఊహించని షాక్‌

Published on Thu, 09/25/2025 - 19:06

మహిళల వన్డే ప్రపంచకప్‌కు (ICC Women's World Cup 2025) ముందు భారత జట్టుకు (Team India) ఊహించని షాక్‌ తగిలింది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 25) జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ పేసర్‌ అరుంధతి రెడ్డి (Arundathi Reddy) గాయపడింది.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో హీథర్‌ నైట్‌ ఆడిన బంతిని క్యాచ్ పట్టే ప్రయత్నంలో అరుంధతి, తన ఎడమ కాలుపై తేడాగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో చాలా సేపు నొప్పితో విలవిలలాడుతూ నేలపై ఉండిపోయింది. ఫిజియో వచ్చి పరీక్షించిన తర్వాత, ఆమెను వీల్‌ చైర్‌‌లో తీసుకెళ్లారు.

అరుంధతి గాయం తీవ్రతపై స్పష్టత లేదు. స్కాన్ల కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే వరల్డ్‌కప్‌లో ఆమె పాల్గొనడం అనుమానంగా మారింది.

27 ఏళ్ల అరుంధతి గత కొంతకాలంగా టీమిండియాలో కీలక బౌలర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది ఆమె 6 ఇన్నింగ్స్‌ల్లో 7 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉంది.  ఒకవేళ మెగా టోర్నీ నుంచి అరుంధతి తప్పుకుంటే, బీసీసీఐ ఆమె ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. టీమిండియా సెప్టెంబర్ 30న శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

వార్మప్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌.. కెప్టెన్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (120 నాటౌట్‌) సెంచరీతో కదంతొక్కడంతో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. బ్రంట్‌కు జతగా ఎమ్మా లాంబ్‌ (74 నాటౌట్‌) క్రీజ్‌లో ఉంది. 42 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 277/3గా ఉంది. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో యామీ జోన్స్‌ 39, హీథర్‌ నైట్‌ 37 పరుగులు చేయగా.. ట్యామీ బేమౌంట్‌ డకౌటైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్‌, అరుంధతి రెడ్డి తలో వికెట్‌ తీశారు. 

చదవండి: న్యూజిలాండ్‌కు షాకిచ్చిన టీమిండియా

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)