Breaking News

శ్రీలంక క్రికెట్‌ దిగ్గజానికి భారీ షాక్‌!

Published on Tue, 12/16/2025 - 09:40

శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ అర్జున రణతుంగ చిక్కుల్లో పడ్డాడు. మంత్రిగా ఉన్న సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రణతుంగను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు సమాచారం.

అంతర్జాతీయ క్రికెట్‌లో అర్జున రణతుంగా శ్రీలంక తరఫున సత్తా చాటాడు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 1996లో కెప్టెన్‌ హోదాలో శ్రీలంకకు వన్డే వరల్డ్‌కప్‌ అందించాడు. రణతుంగ సారథ్యంలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి లంక టైటిల్‌ గెలవడంతో అతడి ప్రతిష్ట మరింత పెరిగింది.

ఇక ఆటకు స్వస్తి పలికిన తర్వాత అర్జున రణతుంగా రాజకీయాల్లో ప్రవేశించాడు. శ్రీలంక రవాణా, విమానయాన శాఖ (2018- 19), పోర్ట్స్‌ అండ్‌ షిప్పింగ్‌ (2015- 17)శాఖ, పెట్రోలియం వనరుల అభివృద్ధి శాఖ (2017-18) మంత్రిగా పనిచేశాడు. అయితే, పెట్రోలియమ్‌ మినిస్టర్‌గా ఉన్న సమయంలో అతడు అవినీతికి పాల్పడినట్లు సమాచారం.

రూ. 23. 5 కోట్లు
ఈ కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ కొలంబో మెజిస్ట్రేట్‌ అసంగ బొడరగమా ముందు సోమవారం తమ వాదనలు వినిపించింది. మొత్తంగా 27సార్లు జరిపిన కొనుగోళ్లలో 800 మిలియన్‌ శ్రీలంకన్‌ రూపాయలు (భారత కరెన్సీలో రూ. 23. 5 కోట్లు) అవినీతి జరిగినట్లు తాము గుర్తించినట్లు తెలిపింది.

కాగా ఈ కేసులో ఇప్పటికే అర్జున రణతుంగ అన్నయ్య, సిలోన్‌ పెట్రోలియమ్‌ చైర్మన్‌గా ఉన్న ధమ్మిక రణతుంగను పోలీసులు సోమవారం అరెస్టు చేశాడు. అయితే, కాసేపటికే అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.

ధమ్మికకు శ్రీలంక పౌరసత్వంతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉండటం గమనార్హం. కాగా అర్జున రణతుంగ  ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడని.. స్వదేశానికి తిరిగి రాగానే అతడిని అరెస్టు చేయనున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. అర్జున రణతుంగ మరో సోదరుడు, పర్యాటక శాఖ మాజీ మంత్రి ప్రసన్న కూడా గత నెలలో ఫ్రాడ్‌ కేసులో అరెస్టయ్యాడు. 

చదవండి: అక్షరాలా రూ.8 వేల కోట్లు!

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)