Breaking News

సచిన్‌ కొడుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

Published on Wed, 01/07/2026 - 13:35

క్రికెట్‌ దిగ్గజం​ సచిన్‌ టెండూల్కర్‌ ఇంటి పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి ఏకైక కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ వివాహ ముహూర్తం ఖరారయ్యింది. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు సానియా ఛందోక్‌ను అర్జున్‌ మనువాడనున్నాడు. 

వీరి వివాహం మార్చి 5న జరుగనుందని నివేదికలు చెబుతున్నాయి. అధికారిక సమాచారమైతే లేదు. వివాహ వేడుకలు మార్చి 3న ప్రారంభమవుతాయని తెలుస్తుంది. ఎక్కువ భాగం కార్యక్రమాలు ముంబైలోనే జరగనున్నట్లు సమాచారం. అతిథుల జాబితాను కూడా ఇరు కుటుంబాలు ఖరారు చేసినట్లు తెలుస్తుంది.  

అర్జున్–సానియా చిన్ననాటి నుంచి స్నేహితులు. టెండూల్కర్–ఘై కుటుంబాల మధ్య ఉన్న బంధం వారి స్నేహాన్ని మరింత బలపరిచింది. గతేడాది ఆగస్ట్‌లో అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థం  జరిగింది. 

ఈ వేడకను ఇరు కుటుంబాలు గోప్యంగా ఉంచాయి. కొద్ది రోజుల తర్వాత సచిన్‌ ఓ వ్యక్తిగత కార్యక్రమంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. సానియా Mr. Paws అనే లగ్జరీ పెట్ స్పా వ్యవస్థాపకురాలు. అదే సంస్థకు ఆమె డైరెక్టర్‌గానూ ఉన్నారు.

అర్జున్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం అతను గోవా తరఫున విజయ్‌ హజారే ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. ఈ టోర్నీలో అతను ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. అర్జున్‌ను ఇటీవల ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ట్రేడింగ్‌ ద్వారా 30 లక్షల బేస్‌ ధరకే ముంబై ఇండియన్స్‌ నుంచి దక్కించుకుంది. 

లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన 26 ఏళ్ల అర్జున్‌ దేశవాలీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాకు ఎంపిక కావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే అతని కల సాకారం కావడం లేదు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)