Breaking News

లార్డ్స్‌లో ఆర్చర్‌ అదుర్స్‌.. 9 పరుగులు, 4 వికెట్లు

Published on Sun, 08/02/2026 - 09:40

ది హండ్రెడ్ లీగ్ 2026లో సదరన్ బ్రేవ్స్ జ‌ట్టు త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. శ‌నివారం లార్డ్స్ వేదిక‌గా లండ‌న్ స్పిరిట్‌తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో స‌ద‌ర‌న్ బ్రేవ్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లండ‌న్ స్పిరిట్ జ‌ట్టుకు పిచ్ నుంచి ఎలాంటి స‌హకారం ల‌భించ‌లేదు. 

బౌల‌ర్ల‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై స‌ద‌ర‌న్ బ్రేవ్ పేస‌ర్లు పండ‌గ చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ నిప్పులు చెరిగాడు. ఈ ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి లండ‌న్ జట్టును దెబ్బ తీశాడు. ఆర్చర్ త‌న బౌలింగ్‌లో కోటాలో కేవ‌లం 9 ప‌రుగులు మాత్ర‌మే ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. 

అయితే ఒకానొక దశలో 103/5తో ఉన్న లండన్ స్పిరిట్‌.. కేవలం 2 పరుగుల వ్యవధిలోనే మిగతా 5 వికెట్లను కోల్పోయి 105 పరుగులకే ఆలౌట్ అయింది. స‌ద‌ర‌న్ బ్రేవ్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్‌తో పాటు స్టోయినిష్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. లండ‌న్ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (56 పరుగులు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.

అనంత‌రం 106 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించేందుకు సదరన్ బ్రేవ్స్ కూడా తీవ్రంగా శ్ర‌మించింది. ల‌క్ష్య చేధ‌న‌లో బ్రేవ్స్ 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. 

ఈ స‌మ‌యంలో డేవిడ్ మిల్ల‌ర్(28 బంతుల్లో 39 నాటౌట్‌) నిల‌క‌డ‌గా ఆడి జ‌ట్టును గెలిపించాడు. మిల్ల‌ర్‌తో పాటు ఓపెన‌ర్ జేమీ స్మిత్ 36 ప‌రుగులతో రాణించాడు. ఫలితంగా సదరన్‌ బ్రేవ్‌ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 97 బంతుల్లో చేధించింది. లండ‌న్ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ రెండు, జంపా, కోల్స్ త‌లా వికెట్ సాధించారు.
చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్‌కు మరో అగ్నిపరీక్ష!

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)