Breaking News

కర్ణాటక కెప్టెన్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ కొడుకు.. కరుణ్‌ నాయర్‌ రీఎంట్రీ

Published on Tue, 10/07/2025 - 12:42

త్వరలో జరుగనున్న వినూ మన్కడ్‌ ట్రోఫీ, రంజీ ట్రోఫీల కోసం కర్ణాటక జట్లను ఇవాళ ప్రకటించారు. వినూ మన్కడ్‌ ట్రోఫీలో పాల్గొనే జట్టుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ ద్రవిడ్‌ (Anvay Dravid) సారధిగా ఎంపిక కాగా.. రంజీ ట్రోఫీ జట్టుకు మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal) కెప్టెన్‌గా కొనసాగాడు. ఈసారి రంజీ జట్టులో పలు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కృతిక్‌ కృష్ణ, శిఖర్‌ షెట్టి, మొహిసిన్‌ ఖాన్‌ తొలిసారి రంజీ జట్టులో చోటు దక్కించుకున్నారు.

కరుణ్‌ నాయర్‌ రీఎంట్రీ
ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో విఫలమై, విండీస్‌ పర్యటనకు ఎంపిక కాని కరుణ్‌ నాయర్‌ (karun Nair) కర్ణాటక రంజీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. కరుణ్‌ గత రెండు రంజీ సీజన్లలో విదర్భ తరఫున ఆడాడు. గత సీజన్‌లో విదర్భ ఛాంపియన్‌గా నిలవడంలో కరుణ్‌ కీలకపాత్ర (16 ఇన్నింగ్స్‌ల్లో 53.96 సగటున 863 పరుగులు) పోషించాడు. 

గతకొంతకాలంగా దేశవాలీ క్రికెట్‌లో పరుగులు వరద పారించి, సెంచరీల మోత మోగించి టీమిండియాకు ఎంపికైన కరుణ్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో నిరాశపరిచాడు. అక్టోబర్ 15న రాజ్‌కోట్‌లో సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌తో కరుణ్‌ కర్ణాటక తరఫున పునరాగమనం చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.

2025/26 రంజీ సీజన్‌ కోసం కర్ణాటక జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ఆర్ స్మరణ్, కేఎల్ శ్రీజిత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ గోపాల్, వైశాక్ విజయకుమార్, విద్వత్ కవేరప్ప, అభిలాష్ శెట్టి, ఎం వెంకటేష్, నికిన్ జోస్, అభినవ్ మనోహర్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), కేవీ అనీష్, మోహ్సిన్ ఖాన్, శిఖర్ శెట్టి.

కెప్టెన్‌గా అన్వయ్‌ ద్రవిడ్‌
50 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే వినూ మన్కడ్‌ ట్రోఫీ అక్టోబర్‌ 9 నుంచి 17 వరకు డెహ్రాడూన్‌లో జరుగనుంది. ఈ టోర్నీ కోసం కర్ణాటక జట్టు కెప్టెన్‌గా అన్వయ్‌ ద్రవిడ్‌ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్‌ కెప్టెన్‌) ఎస్‌ మణికాంత్‌ నియమితుడయ్యాడు.

వినూ మన్కడ్‌ ట్రోఫీ 2025 కోసం​ కర్ణాటక జట్టు: అన్వయ్‌ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స, ఎస్ మణికాంత్‌ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రతన్ బీఆర్, వైభవ్ శర్మ, కేఏ తేజస్, అథర్వ్ మాల్వియా, సన్నీ కాంచి, రెహాన్ మహమ్మద్

అన్వయ్‌ ద్రవిడ్‌కు అవార్డు
గత ఎడిషన్‌ అండర్‌-19 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో (రెడ్‌బాల్‌) సత్తా చాటిన అన్వయ్‌ ద్రవిడ్‌ను కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ సన్మానించింది. ఈ టోర్నీలో అన్వయ్‌ 6 మ్యాచ్‌ల్లో 91.80 సగటున 459 పరుగులు సాధించి, కర్ణాటక తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

కాగా, రాహుల్‌ ద్రవిడ్‌ మరో కుమారుడు (పెద్దవాడు) కూడా క్రికెటరే అన్న విషయం తెలిసిందే. తమ్ముడు అండర్‌-16 విభాగంలో సత్తా చాటుతుంటే, అన్న సమిత్‌ సీనియర్‌ లెవెల్లో పర్వాలేదనిపిస్తున్నాడు. సమిత్‌ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాగా.. అన్వయ్‌ వికెట్‌ కీపర్ బ్యాటర్‌. 

చదవండి: తగ్గేదేలే!.. 459 పరుగులు.. ద్రవిడ్‌ చిన్న కుమారుడి జోరు..

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)