Breaking News

'ట్రయల్స్‌ నెగ్గింది కూర్చోవడానికి కాదు.. సుప్రీంకు వెళతాం'

Published on Sun, 07/23/2023 - 13:44

న్యూఢిల్లీ: స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, వినేశ్‌ ఫొగాట్‌లకు సెలక్షన్స్‌నుంచి మినహాయింపునిస్తూ నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై నమోదైన రిట్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ తీర్పునిచ్చారు.

ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటలకే సెలక్షన్‌ ట్రయల్స్‌లో అంతిమ్‌ పంఘాల్‌ గెలిచింది. శనివారం నిర్వహించిన 53 కేజీల సెలక్షన్‌ ట్రయల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇదే కేటగిరీలో వినేశ్‌ను ఇప్పటికే ఎంపిక చేయడంతో అంతిమ్‌ స్టాండ్‌బైగా మాత్రమే ఉండే అవకాశం ఉంది.

కానీ తాను స్టాండ్‌బైగా కూర్చునేందుకు సిద్ధంగా లేనని ఆమె  ప్రకటించింది. హైకోర్టులో ప్రతికూలంగా వచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పోరాడతానని 19 ఏళ్ల పంఘాల్‌ తెలిపింది. ‘కష్టపడి ట్రయల్స్‌ నెగ్గిన నేను ఎందుకు స్టాండ్‌బైగా ఉండాలి. దర్జాగా మినహాయింపు పొందినవారే కూర్చోవాలి’ అని వినేశ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.

బజరంగ్, వినేశ్‌లను రెజ్లింగ్‌ సమాఖ్య అడ్‌హాక్‌ కమిటీ ట్రయల్స్‌ లేకుండానే ఆసియా క్రీడలకు ఎంపిక చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ యువ రెజ్లర్లు అంతిమ్‌ పంఘాల్, సుజీత్‌ కల్కాల్‌ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించారు.

చదవండి: #koreaOpen: సాత్విక్‌-చిరాగ్‌ జోడి సంచలనం.. కొరియా ఓపెన్‌ కైవసం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)