Breaking News

టీమిండియా ప్లేయ‌ర్ అరుదైన రికార్డు.. ప‌దేళ్ల త‌ర్వాత‌

Published on Wed, 11/04/2026 - 12:53

ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొద‌టి వ‌న్డే మ్యాచ్‌లో భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అసాధార‌ణ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 25 ఏళ్ల కాంబోజ్ స‌రైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి కివీస్ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ఈ హ‌ర్యానా పేస‌ర్  తన 10 ఓవర్ల కోటాలో 2 మైడెన్లతో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

కాంబోజ్ 2.20 ఎకానమీతో బౌలింగ్ చేసి కివీస్‌ను నామ‌మాత్ర‌పు స్కోర్‌కే ప‌రిమితం చేశాడు. అన్షుల్ గత నెలలో వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌లో డెబ్యూ చేశాడు. త‌న డెబ్యూ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా సాధించిక‌పోయిన‌ప్ప‌టికి.. త‌న రెండో మ్యాచ్‌లో మాత్రం ఇర‌గ‌దీశాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో అన్షుల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

న్యూజిలాండ్ గ‌డ్డ‌పై  కివీస్‌పై భారత్ తరఫున అత్యంత ఎకనామికల్ స్పెల్ (కనీసం 10 ఓవర్లు) బౌలింగ్ చేసిన నాలుగో బౌల‌ర్‌గా కాంబోజ్ నిలిచాడు. ఈ జాబితాలో భార‌త దిగ్గ‌జ పేస‌ర్ జ‌వ‌గ‌ల్ శ్రీనాథ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 2003లో ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన వ‌న్డేలో శ్రీనాథ్ కేవ‌లం 13 పరుగులు మాత్ర‌మే ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

కివీస్‌ గడ్డపై అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు

జవగల్ శ్రీనాథ్: 3/13 – ఆక్లాండ్, 2003 (ఎకానమీ: 1.30)

ఆశిష్ నెహ్రా: 2/16 – ఆక్లాండ్, 2002 (ఎకానమీ: 1.60)

కపిల్ దేవ్: 2/18 – ఆక్లాండ్, 1994 (ఎకానమీ: 1.80)

అన్షుల్ కంబోజ్: 2/22 – ఆక్లాండ్, 2026 (ఎకానమీ: 2.20)*

జవగల్ శ్రీనాథ్: 4/23 – ఆక్లాండ్, 2002 (ఎకానమీ: 2.30)

అంతేకాకుండా 2016లో జింబాబ్వేపై జస్ప్రీత్ బుమ్రా (1/22) సాధించిన గణాంకాల తర్వాత గడిచిన తొమ్మిదేళ్లలో ఒక భారత పేస‌ర్ నమోదు చేసిన అత్యుత్తమ ఎకనామికల్ స్పెల్ ఇదే కావడం విశేషం.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)