Breaking News

మరోసారి 'యూ టర్న్‌' తీసుకోనున్న బెన్‌ స్టోక్స్‌..!

Published on Wed, 09/25/2024 - 15:37

ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు సారధి బెన్‌ స్టోక్స్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2023 వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా స్టోక్స్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని బరిలోకి దిగాడు. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ ఘోర పరాభవం నేపథ్యంలో స్టోక్స్‌ అప్పటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు దూరంగా ఉన్నాడు. తాజాగా స్టోక్స్‌ లిమిటెడ్‌ ఓవర్స్‌ క్రికెట్‌లోని మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని క్లూ ఇచ్చాడు. ఈ విషయమై జట్టు కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ తనను సంప్రదిస్తే తాను రెడీ అంటూ సంకేతాలు పంపాడు.

రిటైర్మెంట్‌ విషయమై ఆటగాళ్లు మనసు మార్చుకోవడం ఇటీవలికాలంలో పరిపాటిగా మారింది. చాలా మంది క్రికెటర్లు స్టోక్స్‌ లాగే తొలుత రిటైర్మెంట్‌ ప్రకటిస్తారు.. ఆతర్వాత ఆ కారణం.. ఈ కారణం చెప్పి తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవలే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తావించాడు. రిటైర్మెంట్‌పై యూ టర్న్‌ తీసుకోవడం ఆటగాళ్లకు ఫ్యాషన్‌గా మారిపోయిందని హిట్‌మ్యాన్‌ వ్యాఖ్యానించాడు.

స్టోక్స్‌ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్‌ టెస్ట్‌ సారధి వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ దృష్ట్యా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఐసీసీ మెగా టోర్నీ కావడంతో స్టోక్స్‌ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తుండవచ్చు. మళ్లీ ఈ టోర్నీ అయిపోయిన వెంటనే స్టోక్స్‌ రిటైర్మెంట్‌ ప్రకటించినా ఆశ్యర్యపోనక్కర్లేదు. 

33 ఏళ్ల స్టోక్స్‌ ఫిట్‌నెస్‌ పరంగానూ పెద్దగా పర్ఫెక్ట్‌గా లేడు. టెస్ట్‌ల్లో కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో అతను తిరిగి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. టెస్ట్‌ల్లో మాత్రం అతన్ని మ్యాచ్‌ విన్నర్‌గా తీసిపారేయడానికి వీళ్లేదు. జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం అతనికి ఇంకా ఉంది.

స్టోక్స్‌ ఇంగ్లండ్‌ తరఫున 105 టెస్ట్‌లు, 114, 43 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అతను గత కొంతకాలం యాక్టివ్‌గా లేడు. మెక్‌కల్లమ్‌ ఇంగ్లండ్‌ ఫుల్‌టైమ్‌ హెడ్‌ కోచ్‌గా నియమితుడైన తర్వాత స్టోక్స్‌ పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. 

చదవండి: మెరుగుపడిన యశస్వి, గిల్‌ ర్యాంక్‌లు.. తలో ఐదు స్థానాలు కోల్పోయిన రోహిత్‌, విరాట్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)