Breaking News

ఆస్ట్రేలియాకు మ‌రో భారీ షాక్‌..

Published on Tue, 01/13/2026 - 21:07

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు ఆస్ట్రేలియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు జోష్ హాజిల్‌వుడ్‌, ప్యాట్ కమ్మిన్స్‌, టిమ్ డేవిడ్ గాయాలతో బాధపడుతుండగా.. ఇప్పుడు ఈ జాబితాలో స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిష్ చేరాడు. బిగ్ బాష్ లీగ్ 2025-26లో భాగంగా మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోయినిష్( మెల్‌బోర్న్ స్టార్స్) గాయపడ్డాడు.

ఏమి జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో మొదట ‍బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ 20 బంతుల్లో 23 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

అయితే విజయానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో..  జేమీ ఓవర్టన్ వేసిన ఓ రకాసి బౌన్సర్ స్టోయినిస్ కుడి చేతి బొటనవేలుకు బలంగా తగిలింది. తీవ్రమైన నొప్పితో విలవిలలాడిన మార్కస్‌.. ఫిజియో సూచనతో  'రిటైర్డ్ అవుట్'గా వెనుదిరిగాడు.

అతడిని మ్యాచ్ అనంతరం స్కాన్‌కు తరలించారు. అతడి గాయంపై అప్‌డేట్ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికి మెగా టోర్నీకి ముందు స్టార్ ప్లేయర్లు గాయపడడం ఆసీస్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.

టీ20 ప్రపంచకప్‌-2026కు ఆసీస్‌ జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
చదవండి: 'భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు'.. మారని బంగ్లాదేశ్‌ వైఖరి

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)