ఓడిపోయామన్న బాధ లేదు.. నేనే గనుక అక్కడి ఉంటేనా..! కథ వేరే..

Published on Sun, 09/21/2025 - 14:23

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు తీరుపై టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ ఓడిపోయామన్న బాధ లేకుండా.. కేవలం ‘నో- షేక్‌హ్యాండ్‌’ మీద రాద్ధాంతం చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డాడు. కరచాలనం విషయంలో మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తప్పేమీ లేదని.. తానే గనుక అతడి స్థానంలో ఉంటే పాక్‌ జట్టుతోనే సారీ చెప్పించుకునేవాడినని అశూ అన్నాడు.

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ (IND vs PAK) జట్లు ఆసియా కప్‌ టీ20-2025లో భాగంగా తొలిసారి ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. దుబాయ్‌ వేదికగా గత ఆదివారం (సెప్టెంబరు 14) జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు.. పాక్‌ ప్లేయర్లతో కరచాలనానికి నిరాకరించారు.

ఆసియా కప్‌ నుంచి వైదొలుగుతామని డ్రామా
ఈ విషయాన్ని అవమానంగా భావించిన పాక్‌ క్రికెట్‌.. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ వ్యవహారశైలిపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఇక ముందు పాక్‌ ఆడే మ్యాచ్‌లకు రిఫరీగా ఆయనను తొలగించాలని కోరింది. లేదంటే ఆసియా కప్‌ నుంచి వైదొలుగుతామని డ్రామా చేసింది. అయితే, ఐసీసీ దిగిరాకపోగా.. యూఏఈతో పాక్‌ మ్యాచ్‌లోనూ ఆండీనే కొనసాగించింది. అంతేకాదు.. తదుపరి సూపర్‌-4లో భాగంగా ఆదివారం (సెప్టెంబరు 21) నాటి భారత్‌- పాక్‌ పోరులోనే అతడినే రిఫరీగా ఎంపిక చేసింది.

స్కూల్‌ టీచరా? లేదా ప్రిన్సిపలా?
ఈ నేపథ్యంలో పాక్‌ వ్యవహారశైలిపై అశ్విన్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ‘‘నిజానికి మీ పరువు పోకుండా ఆండీ పైక్రాఫ్ట్‌ మిమ్మల్ని కాపాడారు. తాము హ్యాండ్‌షేక్‌ చేయమన్న విషయాన్ని టీమిండియా ముందుగానే రిఫరీకి చెప్పింది. అదే విషయాన్ని ఆయన మీకు చెప్పారు. అంతే. కానీ మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత మీరు చేసిన డ్రామా ఏంటి? అసలు దేని గురించి మీ రాద్ధాంతం?..

అయినా ఆండీ పైక్రాఫ్ట్‌ ఏమైనా స్కూల్‌ టీచరా? లేదా ప్రిన్సిపలా?.. సూర్య దగ్గరికి వెళ్లి.. ‘రండి.. వచ్చి కరచాలనం చేయండి’ అని చెప్పాలా? ఆయన పని అది కాదు కదా!.. కాబట్టి ఇందులో మీకు ఆయన తప్పు ఎక్కడ కనిపించింది? 

మీతోనే సారీ చెప్పించుకునేవాడిని
నేనే గనుక ఆండీ స్థానంలో ఉండి ఉంటే.. ఇలా చేసినందుకు మీతోనే సారీ చెప్పించుకునేవాడిని. ఆయన మీకెందుకు క్షమాపణ చెప్పాలి?’’ అంటూ పాక్‌ క్రికెట్‌ బోర్డు తీరును అశ్విన్‌ ఏకిపారేశాడు. కాగా యూఏఈతో మ్యాచ్‌కు ముందు బాయ్‌కాట్‌ నాటకం ఆడిన పాక్‌.. ఐసీసీ దిగిరాకపోవడంతో రిఫరీ ఆండీ తమకు క్షమాపణలు చెప్పాడంటూ ఆడియోలేని ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)