చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తనయుడు

Published on Thu, 01/23/2025 - 21:07

ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ తనయుడు రాకీ ఫ్లింటాఫ్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ లయన్స్‌ (అండర్-19 జట్టు) తరఫున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. రాకీ 16 ఏళ్ల 291 రోజుల వయసులో లయన్స్‌ తరఫున సెంచరీ చేశాడు. 

ఇ​క్కడ మరో విశేషమేమిటంటే.. రాకీ స్వయానా తన తండ్రి రికార్డునే బద్దలు కొట్టాడు. రాకీకి ముందు లయన్స్‌ తరఫున అతి చిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు ఆండ్రూ ఫ్లింటాఫ్‌ పేరిట ఉండేది. ఆండ్రూ ఫ్లింటాఫ్‌ 20 ఏళ్ల 28 రోజుల వయసులో లయన్స్‌ తరఫున సెంచరీ చేశాడు.

క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ సెంచరీ చేశాడు. రాకీకి లయన్స్‌ తరఫున ఇదే తొలి సెంచరీ. ఈ మ్యాచ్‌లో రాకీ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగి కష్టాల్లో ఉన్న తన జట్టును (161/7)  గట్టెక్కించాడు. ఈ మ్యాచ్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) రాకీ 127 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు.

రాకీ సెంచరీతో సత్తా చాటడంతో లయన్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఆస్ట్రేలియా ఎలెవెన్‌ 214 పరుగులకే చాపచుట్టేసింది. రాకీ హీరోయిక్‌ ఇన్నింగ్స్‌ కారణంగా లయన్స్‌కు 102 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

కాగా, ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో మూడు నాలుగు రోజుల మ్యాచ్‌ల సిరీస్‌ కోసం లయన్స్‌ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో లయన్స్‌ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఆ మ్యాచ్‌లో రాకీ తొలి ఇన్నింగ్స్‌లో 19, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో లయన్స్‌కు రాకీ తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్‌ హెడ్‌ కోచ్‌ కావడం గమనార్హం. ఈ సిరీస్‌లో లయన్స్‌ తరఫున ఐదుగురు ఇంగ్లండ్‌ సీనియర్‌ జట్టు ఆటగాళ్లు (షోయబ్‌ బషీర్‌, పాట్‌ బ్రౌన్‌, టామ్‌ హార్ట్లీ, జోష్‌ టంగ్‌, జాన్‌ టర్నర్‌ ఆడుతున్నారు.  
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)