Breaking News

ఆండ్రీ రసెల్‌ కీలక నిర్ణయం

Published on Sun, 11/30/2025 - 13:21

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)- 2026 వేలానికి వెస్టిండీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు గుడ్‌బై చెప్పిన రసెల్‌.. మరో కొత్త అవతారంలో అభిమానుల ముందుకు రానున్నట్లు తెలిపాడు.

ఐపీఎల్‌-2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) సహాయక సిబ్బంది బృందంలో చేరనున్నట్లు రసెల్‌ వెల్లడించాడు. ఈ సందర్భంగా కేకేఆర్‌ జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలిపేలా రసెల్‌ (Andre Russel) ఓ ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేశాడు. సుదీర్ఘ కాలంగా తనకు అండగా నిలిచిన కేకేఆర్‌ యాజమాన్యంతో పాటు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ​

వేలంలోకి వదిలిన కేకేఆర్‌
కాగా 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అడుగుపెట్టిన రసెల్‌.. 2014లో కేకేఆర్‌లో చేరాడు. ఇక అప్పటి నుంచి కోల్‌కతానే ప్రయాణం సాగించిన ఈ పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. గతేడాది టైటిల్‌ గెలిచిన కేకేఆర్‌ టీమ్‌లో అతడు మెంబర్‌ కూడా!

ఈ క్రమంలో ఐపీఎల్‌-2025 వేలానికి ముందు కేకేఆర్‌ రసెల్‌ను రూ. 12 కోట్ల భారీ మొత్తానికి రిటైన్‌ చేసుకుంది. ఈ ఏడాది 10 ఇన్నింగ్స్‌ ఆడి 167 పరుగులు చేసిన రసెల్‌.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ సీజన్‌లో రహానే సారథ్యంలోని కేకేఆర్‌ చేదు ఫలితాలు చవిచూసింది. 

రెండో ఇన్నింగ్స్‌లోనూ కేకేఆర్‌తోనే..
ఈ నేపథ్యంలో తమ ఖరీదైన ఆటగాళ్లు వెంకటేశ్‌ అయ్యర్‌ (రూ. 23.75 కోట్లు), రసెల్‌ (రూ. 12 కోట్లు) 2026 వేలానికి ముందు కేకేఆర్‌ విడిచిపెట్టింది. దీంతో రసెల్‌ను తిరిగి తక్కువ ధరకు కేకేఆర్‌ దక్కించుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం కాగా.. అతడు రిటైర్మెంట్‌ ప్రకటించడం విశేషం. 

అయితే, కోచింగ్‌ సిబ్బందిలో ఒకడిగా కేకేఆర్‌తో కొనసాగుతానన్న 37 ఏళ్ల రసెల్‌ ప్రకటన పట్ల ఆ జట్టు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లు ఆడిన రస్సెల్‌ 2,651 పరుగులు చేయడంతో పాటు 123 వికెట్లు తీశాడు. 

చదవండి: IPL: సంచలన నిర్ణయం తీసుకున్న 'డుప్లెసిస్'

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)