Breaking News

ఆండర్సన్‌ ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి

Published on Sat, 03/09/2024 - 10:21

Ind vs Eng- James Michael Anderson 700 Test Wickets: ఇంగ్లండ్‌ వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఆండర్సన్‌ ఈ ఘనత సాధించాడు. 

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ధర్మశాలలో నామమాత్రపు ఐదో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 218 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. ఈ క్రమంలో.. మూడో రోజు ఆటలో టీమిండియా 477 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది.  

అయితే, శనివారం నాటి ఆట ఆరంభమైన కాసేపటికే జేమ్స్‌ ఆండర్సన్‌ నైట్‌ వాచ్‌మన్‌ కుల్దీప్‌ యాదవ్‌(30)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆండర్సన్‌ ఖాతాలో 700వ టెస్టు వికెట్‌ జమ అయింది. ఈ క్రమంలో.. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన తొలి పేసర్‌గా అతడు రికార్డు సాధించాడు. 41 ఏళ్ల వయసులో ఆండర్సన్‌ ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే
ముత్తయ్య మురళీధరన్‌(శ్రీలంక- స్పిన్నర్‌)- 800
షేన్‌ వార్న్‌(ఆస్ట్రేలియా- స్పిన్నర్‌)- 708
జేమ్స్‌ ఆండర్సన్‌(ఇంగ్లండ్‌- పేసర్‌)- 700*
అనిల్‌ కుంబ్లే(ఇండియా- స్పిన్నర్‌)- 619
స్టువర్ట్‌ బ్రాడ్‌ (ఇంగ్లండ్‌- పేసర్‌)- 604 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)