Breaking News

రూట్‌, స్మిత్‌ అదరగొడుతున్నారు.. కేన్‌ మామ లైన్‌లోకి వచ్చాడు, కోహ్లి పరిస్థితి ఏంటి..?

Published on Tue, 02/28/2023 - 18:08

BGT 2023 IND VS AUS 3rd Test: ప్రస్తుత క్రికెట్‌ జనరేషన్‌లో విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌, జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌ ఫాబ్‌ ఫోర్‌ బ్యాటర్లుగా కీర్తించబడుతున్న విషయం తెలిసిందే. ఈ నలుగురిలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిది అన్ని విషయాల్లో పైచేయి అన్న విషయంతో (కొద్ది రోజుల ముందు వరకు) దాదాపు అందరూ ఏకీభవించేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితి తారుమారైపోయింది.

కోహ్లిని ఏ విషయంలో గొప్ప అని చెప్పుకోవాలో టీమిండియా ఫ్యాన్స్‌కు అర్ధం కావట్లేదు. టెక్నిక్‌, పరుగులు, సెంచరీలు, రికార్డులు ఇలా చెప్పుకుం‍టు పోతే దాదాపు అన్ని విషయాల్లో సహచరులతో పోలిస్తే కోహ్లి వెనకపడి ఉన్నాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రూట్‌, స్మిత్‌, విలియమ్సన్‌తో పోలిస్తే కాస్త పర్వాలేదనిపించినా..  టెస్ట్‌ల్లో మాత్రం కోహ్లి ప్రదర్శన నానాటికి తీసికట్టుగా మారుతుం‍దన్నది బహిరంగ రహస్యం.

2021 ఆరంభంలో కోహ్లి ఫ్యాబ్‌ ఫోర్‌ ఆటగాళ్లలో అందరికంటే అత్యధిక టెస్ట్‌ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా ఉండేవాడు. నాటికి కోహ్లి 27 సెంచరీలు చేసి ఉంటే, స్మిత్‌ 26, విలియమ్సన్‌ 24, రూట్‌ 17 సెంచరీలు మాత్రమే చేశారు. అదే 2023 ఫిబ్రవరి వచ్చే సరికి కోహ్లి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా అదే 27 సెంచరీల మార్కు వద్ద మిగిలిపోగా.. స్మిత్‌ 30, రూట్‌ 29, విలియమ్సన్‌ 26 సెంచరీల మార్కును అందుకున్నారు.

వీరిలో రూట్‌ గత రెండేళ్ల కాలంలో ఏకంగా 12 సెంచరీలు బాదగా.. స్మిత్‌ మధ్యమధ్యలో  మూడంకెల ఫిగర్‌ అందుకున్నాడు. వీరితో పోలిస్తే విలియమ్సన్‌, కోహ్లి పరిస్థితి దారుణంగా ఉంది. విలియమ్సన్‌ లేటుగా అయిన రెండేళ్ల తర్వాత.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో సెంచరీ చేయగా.. 2021 జనవరిలో చివరి టెస్ట్‌ సెంచరీ చేసిన  కోహ్లి దాదాపు మూడేళ్లైపోయినా ఇప్పటివరకు శతక్కొట్టలేదు.

పరిమిత ​ఓవర్ల ఫార్మాట్‌లో సెంచరీలు చేసిన కోహ్లి టెస్ట్‌ల్లో మాత్రం ఈ మార్కును అందుకోలేకపోతున్నాడు. ఇదే కొనసాగితే.. విలియమ్సన్‌ కోహ్లిని దాటిపోయి టెస్ట్‌ల్లో కేవలం 9 సెంచరీలు మాత్రమే కలిగిన బాబర్‌ ఆజమ్‌ కూడా కోహ్లిని అధిగమించే ప్రమాదం ఉంది. ఓవరాల్‌గా చూస్తే.. సెంచరీల విషయంలో ఫాబ్‌ ఫోర్‌ ఆటగాళ్లలో కోహ్లి 74 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. రూట్‌ 45, స్మిత్‌ 42, విలియమ్సన్‌ 39 సెంచరీలు చేశారు. టెస్ట్‌ల్లో కోహ్లి మూడేళ్ల సెంచరీ దాహానికి తెరదించి, ఆసీస్‌తో జరిగే మూడో టెస్ట్‌లో శతక్కొట్టాలని ఆశిద్దాం 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు