Breaking News

అమెరికా ముందుకు... పాక్‌ ఇంటికి   

Published on Sat, 06/15/2024 - 04:14

లాడర్‌హిల్‌ (ఫ్లోరిడా): టి20 ప్రపంచ కప్‌లో అత్యంత కీలక ఫలితం! తొలిసారి ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆతిథ్య అమెరికా జట్టు సూపర్‌–8 దశకు అర్హత సాధించింది. గ్రూప్‌ ‘ఎ’లో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ గ్రూప్‌ నుంచి భారత్‌ (6 పాయింట్లు), అమెరికా (5 పాయింట్లు) ముందంజ వేశాయి. ఆడిన 3 మ్యాచ్‌లలో ఒకటే గెలిచిన 2009 చాంపియన్‌ పాకిస్తాన్‌ లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. 

గత రెండు టి20ల్లో వరల్డ్‌ కప్‌లలో వరుసగా సెమీఫైనల్, ఫైనల్‌ వరకు చేరిన పాక్‌ ఈసారి పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. భారత్‌తో పాటు అమెరికా చేతిలో ఓడిన ఆ జట్టు కెనడాపై మాత్రం గెలవగలిగింది. ఈ గ్రూప్‌లో బలహీన కెనడాపై నెగ్గిన అమెరికా... పాక్‌పై సంచలన విజయం సాధించి తమ అవకాశాలు మెరుగుపర్చుకుంది. తాజా ఫలితంతో ఆదివారం ఐర్లాండ్‌తో తమ చివరి మ్యాచ్‌ ఆడకుండానే వరల్డ్‌ కప్‌లో పాక్‌ ఆట ముగిసింది. 

లాడర్‌హిల్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కూడా తెరిపినివ్వలేదు. నిర్ణీత సమయం నుంచి దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వర్షం తగ్గినా మ్యాచ్‌ కోసం మైదానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాలేదు. 

పదే పదే తనిఖీల తర్వాత కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించాలని ఆశించినా... మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతిథ్య జట్టు హోదాలో బరిలోకి దిగి సూపర్‌–8కు చేరడం ద్వారా అమెరికా 2026 టి20 వరల్డ్‌ కప్‌కు కూడా నేరుగా అర్హత సాధించింది.  

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)