Breaking News

WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్‌ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్‌ స్టార్‌ ప్లేయర్‌

Published on Thu, 11/07/2024 - 09:58

బ్రిడ్జ్‌టౌన్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజ‌య భేరి మ్రోగించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను 2-1 తేడాతో విండీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విండీస్ స్టార్ పేస‌ర్ అల్జారీ జోష‌ఫ్ కెప్టెన్ షాయ్ హోప్‌తో విభేదాల కార‌ణంగా మ్యాచ్ మ‌ధ్య‌లోనే మైదానం నుంచి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో అంతా ఒక్క‌సారిగా షాక్ అయిపోయారు.

అస‌లేం జ‌రిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్హ‌నించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం ద‌క్క‌లేదు. 3 ఓవ‌ర్‌లోనే విల్ జాక్స్ రూపంలో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. దీంతో ఫ‌స్ట్‌డౌన్‌లో యువ ఆట‌గాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వ‌చ్చాడు. 

కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డ‌ర్ల‌ను విండీస్ కెప్టెన్ సెట్ చేశాడు. అయితే ఈ ఫీల్డ్ ప్లేస్‌మెంట్ నాలుగో ఓవ‌ర్ వేసేందుకు వ‌చ్చిన జోష‌ఫ్‌కు న‌చ్చ‌లేదు. దీంతో హోప్‌తో జోషఫ్‌ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్‌ను జోషఫ్‌ కొనసాగించాడు.

ఆ ఓవర్‌లో నాలుగో బంతికి కాక్స్‌ను జోషఫ్‌ ఔట్‌ చేశాడు. జోషఫ్‌ వికెట్‌ సాధించినప్పటకి కనీసం సెలబ్రేట్‌ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోషఫ్‌ మాత్రం సీరియస్‌గా హోప్‌తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.

అంతటితో ఆగని జోషఫ్‌ తన ఓవర్‌ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్‌ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోషఫ్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
చదవండి: IND vs AUS: రాహుల్ నీవు మార‌వా? ఎక్క‌డ‌కి వెళ్లినా అంతేనా?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)