Breaking News

భారత్‌తో సిరీస్‌కు ముందు విండీస్‌ మరో బిగ్‌ షాక్‌

Published on Mon, 09/29/2025 - 18:26

అక్టోబర్‌ 2 నుంచి భారత్‌తో ప్రారంభంకాబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు (India vs West Indies) ముందు వెస్టిండీస్‌ జట్టుకు (West Indies) మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఇప్పటికే యువ స్పీడ్‌ గన్‌ షమార్‌ జోసఫ్‌ (Shamar Joseph) (గాయం) సేవలను కోల్పోయిన విండీస్‌.. తాజాగా వారి ప్రధాన పేసర్‌ అల్జరీ జోసఫ్‌ను (Alzarri Joseph) కూడా మిస్‌ అయ్యింది. 

అల్జరీ వెన్నెముక సమస్య కారణంగా భారత్‌తో సిరీస్‌కు దూరమైనట్లు విండీస్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించింది. అల్జరీ స్థానాన్ని జెడియా బ్లేడ్స్‌తో భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. తొలుత అల్జరీ స్థానంలో జేసన్‌ హోల్డర్‌తో భర్తీ చేయాలని విండీస్‌ బోర్డు భావించినప్పటికీ.. అతను నో చెప్పినట్లు తెలుస్తుంది. 

హోల్డర్‌ ముందుగానే ఓ మెడికల్‌ ప్రొసీజర్‌ను ప్లాన్‌ చేసుకున్నందున భారతతో సిరీస్‌ ఆడలేనని చెప్పినట్లు సమాచారం.అంతకుముందు షమార్‌ జోసఫ్‌ స్థానాన్ని విండీస్‌ బోర్డు 22 ఏళ్ల బార్బడోస్‌ ఆల్‌రౌండర్‌ జోహాన్‌ లేన్‌తో (Johann Layne) భర్తీ చేసింది.

కాగా, ఆసియా కప్‌ తర్వాత కేవలం 3 రోజుల గ్యాప్‌లోనే భారత్‌, వెస్టిండీస్‌ మధ్య టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 2 నుంచి 6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్‌ జరుగనుంది. అనంతరం అక్టోబర్‌ 10 నుంచి 14 వరకు న్యూఢిల్లీలో రెండో టెస్ట్‌ జరుగుతుంది.

ఈ సిరీస్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. జియో హాట్‌స్టార్‌ యాప్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ అవుతుంది.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్‌కీపర్‌), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌

వెస్టిండీస్: రోస్టన్‌ ఛేజ్‌ (కెప్టెన్‌), కెవ్లాన్‌ ఆండర్సన్‌, తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, జోహన్‌ లేన్‌, అలిక్‌ అథానాజ్‌, బ్రాండన్‌ కింగ్‌, జస్టిన్‌ గ్రీవ్స్‌, షాయ్‌ హోప్‌, టెవిన్‌ ఇమ్లాచ్‌, జోమెల్‌ వారికన్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, జెడియా బ్లేడ్స్‌, జేడన్‌ సీల్స్‌, ఖారీ పియెర్‌

చదవండి: స్టార్‌ క్రికెటర్‌ రిటైర్మెంట్‌

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)