Breaking News

చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Mon, 10/13/2025 - 07:49

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌-2025లో ఆస్ట్రేలియా జోరు కొన‌సాగుతోంది. ఆదివారం వైజాగ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆసీస్ ఘ‌న విజ‌యం సాధించింది.  331 పరుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో కంగారుల కెప్టెన్ అలీసా హీలీ అద్భుత సెంచ‌రీతో చెల‌రేగింది.

107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 142 ప‌రుగులు చేసిన హీలీ.. మ్యాచ్ స్వ‌రూపాన్నే మార్చేసింది.  ఫ‌లితంగా భారీ టార్గెట్‌ను ఆసీస్ 49 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి చేధించింది. హీలీతో పాటు లీచ్ ఫీల్డ్‌(40), పెర్రీ(47), గార్డ‌న‌ర్‌(45) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు.

భార‌త బౌల‌ర్లు ఆఖ‌రిలో పోరాడిన‌ప్ప‌టికి జరగాల్సిన న‌ష్టం అప్ప‌టికే జ‌రిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

ఆసీస్ వ‌ర‌ల్డ్ రికార్డు..
ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ రికార్డును త‌మ ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక జట్టులో 2024లో దక్షిణాఫ్రికాపై 302 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్‌లో లంక కెప్టెన్ చమారి అటపత్తు (195* పరుగులు) భారీ శతకంతో మెరిసింది. అయితే తాజా మ్యాచ్‌తో లంక ఆల్‌టైమ్ రికార్డును ఆసీస్ బ్రేక్ చేసింది.

మహిళల వన్డే క్రికెట్‌లో హైయిస్ట్ ఛేజింగ్‌లు ఇవే..
1.ఆస్ట్రేలియా-భారత్(ప్రత్యర్ధి)-331/7    
2.శ్రీలంక - దక్షిణాఫ్రికా (ప్రత్యర్ధి) -302/4    
3.ఆస్ట్రేలియా -న్యూజిలాండ్ (ప్రత్యర్ధి)-289    
4.ఆస్ట్రేలియా-భారత్ (ప్రత్యర్ధి)-283    
5.ఆస్ట్రేలియా -భారత్ (ప్రత్యర్ధి)-282
చదవండి: చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజమ్‌.. ఆసియాలో తొలి బ్యాటర్‌

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)