Breaking News

CT 2025: షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు.. ముందే!

Published on Mon, 12/02/2024 - 11:31

చాంపియన్స్‌ ట్రోఫీ -2025 నేపథ్యంలో పాకిస్తాన్‌ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య హక్కులను వేరే దేశంతో పంచుకునే క్రమంలో ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేయడంలో తప్పులేదన్నాడు. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోయినా... పాక్‌ జట్టు మాత్రం భవిష్యత్తులో భారత్‌కు వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నాడు.

కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపబోమని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. రోహిత్‌ సేన ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి తెలిపింది.

ఐసీసీ వార్నింగ్‌.. దిగి వచ్చిన పాక్‌
అయితే, పీసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. బీసీసీఐ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను పాక్‌ వెలుపల ఆడేందుకు వీలుగా హైబ్రిడ్‌ విధానాన్ని ప్రతిపాదించింది. అంతేకాదు.. రెవెన్యూపరంగానూ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, పాక్‌ మాత్రం ఇందుకు కూడా అంగీకరించకుండా పంతానికి పోయింది. ఈ క్రమంలో ఐసీసీ హెచ్చరికలకు దిగకతప్పలేదు. ఒకవేళ పీసీబీ పట్టువీడకపోతే.. వేదిక మొత్తాన్ని తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన పాక్‌.. ఎట్టకేలకు హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించినా.. మూడు షరతులు విధించినట్లు సమాచారం.

టీమిండియా ఇక్కడికి రాకున్నా.. పాకిస్తాన్‌ భారత్‌కు వెళ్లాలి
అందులో ప్రధానంగా.. భవిష్యత్తులో భారత్‌లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే తాము కూడా అక్కడికి వెళ్లబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్‌స్టర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందిస్తూ.. ‘‘ఆతిథ్య హక్కులు పంచుకునేందుకు ఒప్పుకొంటే.. అధిక ఆదాయం అడగటం న్యాయమే. అయినా పీసీబీ కనీసం దీనికోసమైనా పట్టుబట్టడంలో తప్పులేదు.

అయితే, భవిష్యత్తులో భారత్‌లో ఈవెంట్లు నిర్వహిస్తే ఆడబోము అనడం మాత్రం సరికాదు. మనం వారికి స్నేహ హస్తం అందించాలి. మన జట్టు ఇండియాకు తప్పకుండా అక్కడికి వెళ్లాలి. అంతేకాదు.. అక్కడ వారిని ఓడించాలి. ఏదేమైనా చాంపియన్స్‌ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్‌ విధానం ముందుగానే ఫిక్సయినట్లు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.

చదవండి: రాకాసి బౌన్సర్‌ వేసిన ఆసీస్‌ బౌలర్‌.. ఇచ్చిపడేసిన జైస్వాల్‌!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)